Pithapuram Sunflower Oil Lorry Theft: కాకినాడ జిల్లాలో లారీ చోరీ ఘటన కలకలం రేపింది. డెయిరీ ఫారమ్ సెంటర్‌కు చెందిన అప్పారావు లారీని భువనేశ్వర్‌కు పంపేందుకు పిఠాపురంలో పార్క్ చేసి తాళం డ్రైవర్ రమణకు ఇచ్చారు. మరుసటి రోజు ఉదయం చూస్తే లారీ కనిపించకుండా పోయింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గొల్లప్రోలు టోల్‌ప్లాజా వద్ద గుర్తించారు. తుని వద్ద లారీని వదిలి ఆయిల్ ప్యాకెట్లు దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.
హైలైట్:
- పిఠాపురం సమీపంలో లారీ
- లారీ దగ్గరకు వెళ్లి చూస్తే ట్విస్ట్
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

లారీ కనిపించకపోవడంతో షాకైన రమణ.. వెంటనే యజమాని అప్పారావుకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఏం జరిగిందో ఆరా తీశారు.. లారీ యజమాని అప్పారావు జరిగిందంతా చెప్పారు. వెంటనే పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా.. గొల్లప్రోలు టోల్‌ప్లాజాను ఆ లారీ దాటుకుని వెళ్లినట్లు తేల్చారు. మంగళవారం అర్ధరాత్రి 1.27 గంటల సమయంలో టోల్‌ప్లాజాను దాటి వెళ్లడం కనిపించింది. కాకినాడ పోలీసులు వెంటనే విశాఖపట్నం వైపు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు.
ఆటోలో సీఎం చంద్రబాబు ప్రయాణం..
ఇంతలో తుని నేషనల్ హైవేపై లారీ ఉన్నట్లు పిఠాపురం పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు లారీ దగ్గరకు వెళ్లి చూస్తే.. ఆయిల్ ప్యాకెట్లు దోచేసినట్లు గుర్తించారు. రోడ్డు పక్కన ఖాళీ లారీని వదిలేసి వెళ్లిపోయారు. లారీ యజమాని అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నారు. లారీలో ఏకంగా రూ.28 లక్షల విలువైన నూనె ప్యాకెట్లు ఉన్నాయని చెబుతున్నారు. పోలీసులు లారీని వదిలేసి వెళ్లిపోయిన ప్రాంతం నుంచి సీసీ ఫుటేజ్ పరిశీలించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏపీలో గతంలో కొన్ని ముఠాలు హైవేలపై చోరీలు చేసిన ఘటనలు ఉన్నాయి. దోపిడీ ముఠానే ఇలా లారీని ఎత్తుకెళ్లి ఆయిల్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలో కూడా ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లడం కలకలం రేపింది.