Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: దంతాలు పచ్చగా ఎందుకు మారుతాయి..? కారణాలు తెలిస్తే అవాక్కే..

9 August 2025

Shubman Gill: జెర్సీ వేలం.. గిల్ జెర్సీకి ఎంత ధర వచ్చిందో తెలుసా..?

9 August 2025

Health Tips: రాత్రి తిన్న వెంటనే నడిస్తే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాకే..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Triple Its Akshaya Patra Food,ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.3,300.. కీలక నిర్ణయం – andhra pradesh government handed over responsibility of managing food and mess in triple its to akshaya patra
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Triple Its Akshaya Patra Food,ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.3,300.. కీలక నిర్ణయం – andhra pradesh government handed over responsibility of managing food and mess in triple its to akshaya patra

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Triple Its Akshaya Patra Food,ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.3,300.. కీలక నిర్ణయం – andhra pradesh government handed over responsibility of managing food and mess in triple its to akshaya patra
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Akshaya Patra Food For AP Triple It Students: ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలోని మెస్‌ల నిర్వహణ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సమర్పించగా.. ఆ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హైలైట్:

  • ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు శుభవార్త
  • ఇకపై అక్షయపాత్ర భోజనం అందిస్తుంది
  • ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది
ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో అక్షయపాత్ర భోజనం
ఏపీ ట్రిపుల్‌ఐటీల్లో అక్షయపాత్ర భోజనం (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో ఉన్న ట్రిపుల్ ఐటీల్లో మెస్‌ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రిపుల్ ఐటీల్లో మెస్‌ల బాధ్యతల్ని అక్షయపాత్రకు అప్పగించారు. కడప జిల్లా ఇడుపులపాయ, ప్రకాశం జిల్లా ఒంగోలు, ఏలూరు జిల్లా నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో అక్షయపాత్ర విద్యార్థులకు భోజనం అందిస్తుంది. ట్రిపుల్ ఐటీ మెస్‌లలో భోజనం సరిగా పెట్టడం లేదని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ట్రిపుల్ ఐటీ మెస్‌లలో భోజనం సరిగా లేదని విద్యార్థులు చాలాకాలంగా ఫిర్యాదు చేశారు. మెస్ నిర్వమించే తీరు సరిగా లేదని ఆరోపించారు. నూజివీడు క్యాంపస్‌కు మంత్రి పార్థసారథి వెళ్లి మరీ పరిశీలించారు.. కానీ ఆ తర్వాత కూడా మార్పు లేదని విద్యార్థులు ఆరోపించారు.. నిరసనలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మెస్‌ల నిర్వహణ, ఫుడ్‌ బాలేదని విద్యార్థులు చెప్పడంతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.. ఆ తర్వాత వారి సూచన మేరకు ప్రభుత్వం మెస్‌ల బాధ్యతల్ని అక్షయపాత్రకు అప్పగించింది. అంతేకాదు ఈ కమిటీ ఒక్కో విద్యార్థికి నాణ్యమైన భోజనం అందించేందుకు రోజుకు రూ.116.67 చెల్లించాలని సూచనలు చేసింది. ఆ తర్వాత వారి సూచన మేరకు ప్రభుత్వం మెస్‌ల బాధ్యతల్ని అక్షయపాత్రకు అప్పగించింది.

Chandrababu: కుర్రాడికి క్లాస్ పీకిన చంద్రబాబు.. మంత్రిని చూపిస్తూ, ఆసక్తికర సీన్

ఏపీ ప్రభుత్వం RGUKT విద్యార్థులకు అక్షయపాత్ర ద్వారా భోజనం అందించనుంది. అక్షయపాత్ర టిఫిన్, రెండు పూటలా భోజనం, స్నాక్స్ అందించినందుకు గాను ప్రభుత్వం రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.110 చెల్లిస్తుంది.. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.3,300 చెల్లిస్తారు.
ఈ మేరకు అక్షయపాత్ర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో వంట పరికరాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.3 కోట్లు కేటాయించింది. అయితే అక్షయపాత్ర శాకాహార భోజనం మాత్రమే అందిస్తుంది కాబట్టి.. విద్యార్థులకు వారానికి ఐదు కోడిగుడ్లు, ఒక రోజు మాంసాహారం ట్రిపుల్‌ఐటీలో ప్రత్యేకంగా వండిస్తారు. ఈ మేరకు ఆర్జీయూకేటీతో అక్షయపాత్ర ఇవాళ ఒప్పందం చేసుకుంది. ఇదిలా ఉంటే అక్షయపాత్రకు టెండర్లు లేకుండా ట్రిపుల్ ఐటీ మెస్ బాధ్యతలు అప్పగించడంపై కొందరు కోర్టుకు వెళ్లారు.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.. కోర్టు ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి