Apsrtc Free Bus Travel Not For Saptagiri Express,ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం.. ఆ ఒక్క రూట్‌లో టికెట్ డబ్బులు కట్టాల్సిందే – apsrtc free bus travel scheme not applicable for saptagiri express buses from tirupati to tirumala
APSRTC Free Bus Journey Tirumala Route Saptagiri Express Not Applicable: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు, ఆధార్ లేదా ఓటర్ కార్డును గుర్తింపుగా చూపించాలి. ఈ పథకం ద్వారా ఆర్టీసీపై భారం పడుతుందని అంచనా వేస్తున్నారు, దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది… కాకపోతే చిన్న అప్డేట్ వచ్చింది.
హైలైట్:
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం
ఆ రూట్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సుకు వర్తించదు
డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాల్సిందే
ఏపీలో ఉచిత బస్సు పథకం (ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది.. రాష్ట్రవ్యా్ప్తంగా ఆగస్టు 15వ తేదీన ఈ పథకం ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఏ, ఏ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు.. ఏ, ఏ కార్డుల్ని గుర్తింపు కార్డులుగా పరిగణిస్తారో క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఒక్క రూట్‌లో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని చెప్పారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్డులో రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉండదంటున్నారు. వాస్తవానికి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చు.. కానీ, తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు వర్తించదు.ఆగష్టు 15 నుంచి రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ద్వారకా తిరుమలరావు తెలిపారు. జీరో టికెట్ విధానం అమలు చేస్తామని.. జిల్లాల మధ్య కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా బస్సులను సిద్ధం చేశామన్నారు. త్వరలో పల్లె వెలుగు ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల సంస్థపై భారం పడుతుందని చెప్పారు.. రోజూ 89 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ట్రాన్స్ జెండర్లు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ లేదా గుర్తింపు కార్డు చూపించాలని సూచించారు. భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉందన్నారు. ప్రస్తుతం 15 లక్షల మంది మహిళలు ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారని.. ఉచిత ప్రయాణం వల్ల ఈ సంఖ్య 26 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆర్టీసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ అవకాశం ఉంది. ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను గుర్తింపు కార్డులుగా చూపిస్తే సరిపోతుంది. రాష్ట్రంలో ఎక్కడినుంచైనా ఎక్కడికైనా ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.. వయోపరిమితి లేదు. రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. దీని వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.1,950 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీకి ఉన్న మొత్తం బస్సుల్లో 74 శాతం అంటే 6,700 బస్సుల్ని ఉచిత బస్సు ప్రయాణం కోసం కేటాయించారు. భవిష్యత్తు అవసరాల కోసం త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి