దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు ఉన్నవారు వేడినీటిలో కర్పూరం వేసుకొని పీల్చటం మంచిది. ఇలా చేయడంతో ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కర్పూరాన్ని మందులలో కూడా వాడతారు. చెదపురుగులు, బట్టలు కొరికి తినే ఇతర కీటకాలను చంపడానికి, దోమలను తరిమికొట్టడానికి కూడా కర్పూరం బిల్లలను ఉపయోగిస్తారు.
కర్పూరాన్ని పెయింటింగ్, బాణసంచా, సహజ పరిమళ ద్రవ్యాలు, సబ్బుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కర్పూరం దాని వాసనతో పాటు మండే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కర్పూరాన్ని కీటక వికర్షకాలలో, దుర్వాసనలను తొలగించడానికి ఉపయోగిస్తారు.
కర్పూరాన్ని తెల్ల చందనం లేదా శొంఠితో కలిపి రాసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పాదాల్లో వాపు లేదా మీ శరీరంలో ఏదైనా అవయవాల్లో నొప్పిగా ఉంటే నూనెలో కర్పూరం కలిపి మసాజ్ చేస్తే రిలీఫ్ పొందవచ్చు.
కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. దాంతో పాటు జుట్టు పొడిబారడం, చుండ్రు సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. కర్పూరంలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల మొటిమలను తొందరగా తొలగిపోతాయి. మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.
స్నానపు నీటిలో కర్పూరం వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే మలినాలు మొత్తం తొలగిపోతాయి. కర్పూరంతో తయారు చేసిన స్ప్రేను ఆర్థరైటిస్ ఉన్నవారు ఉపయోగిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.కర్పూరాన్ని కొన్ని రకాల శీతల పానీయాలు, దగ్గు మందులు, చాక్లెట్లలో రుచినిచ్చే పదార్థంగా కూడా ఉపయోగిస్తారు.