పండుగల సమయంలో భారీయుల ఇంట్లో స్వీట్స్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది. నోరు తీపి చేసుకునేందుకు రకరకాల స్వీట్స్ ను మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ వస్తువులే .. ఈ కల్తీ ఆహారాన్ని తిని అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో రాఖీ పండగ రోజున మీ అన్నదమ్ముల నోటిని తీపి చేయడానికి సొంతంగా స్వీట్ తయారు చేసుకోవాలని కోరుకుంటే మలై రబ్రీ బెస్ట్ ఎంపిక.
సోదరుడు, సోదరి ప్రేమని తెలియజేసే రాఖీ పండగ రోజున అక్కా చెల్లెలు తమ సోదరుడి నోటికి తీపి చేయడానికి ఇంట్లోనే రుచికరమైన మలై రబ్రీని తయారు చేయండి. మీ అన్నదమ్ములకు తినిపించండి. చిక్కటి క్రీమ్ , డ్రై ఫ్రూట్స్‌తో తయారుసే ఈ పర్ఫెక్ట్ మలై రబ్రీ రుచిని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇష్టపడతారు. కనుక ఈ రోజు నోటిలో పెట్టుకోగానే కరిగిపోయే మలై రబ్రీ రుచికరమైన వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మలై రబ్రీ తయారీకి కావలసిన పదార్థాలు
ఫుల్ క్రీమ్ పాలు- 1 లీటరు
చక్కెర- అర కప్పు
ఇవి కూడా చదవండి
కుంకుమ పువ్వు రేకులు -12
యాలకుల పొడి- – అర టీస్పూన్
బాదం పప్పులు- – 10 తరిగి
పిస్తాపప్పులు- 8 తరిగిన
జీడిపప్పులు- 10 తరిగిన
రోజ్ వాటర్- 1 టీస్పూన్
తయారీ విధానం: మలై రబ్డీ చేయడానికి, ముందుగా లోతైన మందపాటి అడుగున ఉన్న పాత్ర తీసుకుని గ్యాస్ స్టవ్ మీద పెట్టి… ఆ పాత్రలో ఫుల్ క్రీం మిల్క్‌ను వేయండి. మీడియం మంట మీద వేడి చేయండి. పాలు మరిగే సమయంలో పాలు పాత్ర అడుగున అంటుకోకుండా నిరంతరం పాలుని కదిలిస్తూ ఉండండి. ఇలా చేయడం వలన పాలు అడుగు పట్టకుండా ఉంటాయి. పాలు మరిగే సమయంలో మంటను స్విమ్ లో పెట్టి.. పాలు చిక్కబడే వరకు వేడి చేయండి. ఇలా పాలు మరిగేటప్పుడు పాత్రలో పాలు తోరకగా క్రీమ్ ఏర్పడుతుంది. ఈ క్రీమ్ ని ఒక గరిటెతో తీసి.. పాత్ర అంచుకి పెట్టండి. పాలు కాగి సగానికి తగ్గే వరకు ఇలా తక్కువ మంట మీద కాయండి. ఇలా చేస్తున్నప్పుడు ఒక చెంచాతో పాలు కలుపుతూ ఉండండి. ఇప్పుడు సగానికి సగం అయిన వేడి పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు రేకలను ముందుగా జోడించండి. ఇది రబ్రీకి అందమైన రంగు, వాసనను ఇస్తుంది. ఇప్పుడు రబ్రీకి యాలకుల పొడి, చక్కెర, కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి, పాలను మరో 5 నిమిషాలు ఉడికించండి. తద్వారా చక్కెర రబ్రీలో బాగా కరిగిపోతుంది. రబ్రీ చిక్కగా అయ్యి, క్రీమ్ దానిలో బాగా కలిసినప్పుడు.. గ్యాస్ ఆపి చివరిగా రోజ్ వాటర్ వేసి బాగా కలపండి. ఇప్పుడు రబ్రీని సర్వింగ్ పాత్రలోకి తీసి చల్లబరచండి. వడ్డించే ముందు రబ్రీని కట్ చేసిన డ్రై ప్రూట్స్, గులాబీ రేకలతో అలంకరించండి. అంతే టేస్టీ టేస్టీ మలై రబ్రీ రెడీ.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..