Coconut Oil: కొబ్బరి నూనె చాలా సాధారణమైన విషయం. ఇది ప్రతి ఇంట్లో సులభంగా దొరికే నూనె. మన చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే చాలా ఖరీదైన ఉత్పత్తులను మనం ఉపయోగిస్తుంటాం. కానీ ఇంట్లో లేదా వంటగదిలో ఉన్న వస్తువులపై మనం ఎప్పుడూ శ్రద్ధ చూపం. కొబ్బరి నూనె ఆరోగ్యానికి అలాగే మొటిమలు, నలుపు వంటి చర్మం, జుట్టు సమస్యలకు కూడా మేలు చేస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే, ఈ నూనెను సరిగ్గా ఎలా ఉపయోగించాలో అందరికీ తెలియదనేది కూడా నిజం. 90% మంది ప్రజలు కొబ్బరి నూనెను తప్పుగా ఉపయోగిస్తున్నారు. చర్మ సమస్యలను ఎదుర్కోవడానికి ఏ విధంగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలి..
కొబ్బరి నూనెను ఉపయోగించడానికి 4 మార్గాలున్నాయి. ఈ 4 మార్గాలు చర్మం నుంచి దంతాల సమస్యల వరకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ హెడ్స్ వదిలించుకోండి..
ముఖం మీద బ్లాక్ హెడ్స్ సమస్య చాలా సాధారణం. దీని కోసం, ప్రజలు తరచుగా ఖరీదైన, రసాయనాలు అధికంగా ఉండే స్క్రబ్‌లు, హార్డ్ పీల్ మాస్క్‌లను ఉపయోగిస్తారు. మీరు డబ్బు ఆదా చేయాలనుకుంటే, కొబ్బరి నూనెలో చక్కెర కలిపి, బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో 2 నుంచి 3 నిమిషాలు సున్నితంగా రుద్దండి. ఇది సహజమైన పద్ధతిలో బ్లాక్ హెడ్స్‌ను ఉచితంగా తొలగిస్తుంది.
ఇవి కూడా చదవండి
నల్లటి వలయాలను వదిలించుకోండి..
కొబ్బరి నూనెలో కాఫీ పొడి కలిపి నల్లటి వలయాల సమస్యను నివారించవచ్చు. దీని కోసం, మీరు ఈ పేస్ట్‌ను కళ్ళ కింద, కనురెప్పలపై పూయాలి. దీనివల్ల కనురెప్పలపై ఉన్న నల్లదనం కూడా తగ్గుతుంది. ఈ పరిహారంతో ఫైన్ లైన్స్ కూడా తగ్గుతాయి.
దంతాల ప్రకాశాన్ని మరింతగా పెంచండి..
మీ దంతాల మెరుపును పెంచడానికి, కొబ్బరి నూనెలో చిటికెడు పసుపు కలపాలి. ఇప్పుడు దానిని బ్రష్‌పై పూసి దంతాలను తేలికగా రుద్దండి. ఈ రెసిపీ సహాయంతో ఎలాంటి రసాయనాలు లేకుండా మీ దంతాలను ప్రకాశవంతం చేయవచ్చు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచురించబడిన ఓ వీడియోపై ఆధారపడి అందించాం. దీనికి టీవీ9 ఎటువంటి బాధ్యత వహించదు. ఏదైనా టిప్స్ పాటించే ముందు ఖచ్చితంగా నిపుణుల సలహాలు తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..