ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘పరీక్ష పే చర్చ’ను 2018 నుండి విద్యా మంత్రిత్వ శాఖ ‘మైగవ్’ సహకారంతో నిర్వహిస్తోంది. ఇటీవల 2025లో జరిగిన ఈ ఎడిషన్‌కు “ఒక నెలలో సిటిజన్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌లో అత్యధిక మంది నమోదు చేసుకున్నారు. దీంతో ఇది కేవలం ఒకే నెలలో 3.53 కోట్ల రిజిస్ట్రేషన్లతో పౌర నిశ్చితార్థ వేదికపై అత్యధిక రిజిస్ట్రేషన్‌లతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది.ఈ మేరకు గత ఆగస్ట్ 4వ తేదీని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు గిన్నిస్ బుక్ సర్టిఫికెట్‌ను అందజేశారు.
కేంద్రమంత్రి ధర్మెంద్ర ప్రధాన్‌కు గిన్నిస్ బుక్ సర్టిఫికెట్‌ను అందజేయడం ఇది రెండవసారి. ఇంతకు ముందు 2015లో ఆయన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిగా ఉన్నప్పుడు, 12.57 కోట్ల కుటుంబాలకు నగదు బదిలీని అందించడానికి “పహల్” (ఎల్‌పిజికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ) పథకం ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమంగా గుర్తింపు పొందింది. దీంతో అప్పుడు ఆయన రికార్డును క్రియేట్ చేశారు. తర్వాత మోదీ నేతృత్వంలో “పరీక్ష పే చర్చ” ఒక నెలలోనే అత్యధిక రిజిస్ట్రేషన్‌లను పొందిన పౌర నిశ్చితార్థ వేదికగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. పరీక్షకు ముందు ప్రధాని మోదీ విద్యార్థులతో సంభాషించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులలో అపారమైన ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా మంది తల్లిదండ్రులు రిజిస్టర్ అయ్యారు. దీంతో మరోసారి ఆయన గిన్నిస్ బుక్ సర్టిఫికెట్ అందుకున్నారు.
అయితే ఇప్పటివరకు, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కార్యక్రమాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కించుకున్నాయి. అందులో రెండు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాయకత్వంలో అమలు చేయబడ్డాయి. వీటితో పాటు, అంతర్జాతీయ యోగా దినోత్సవం (2015), ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.