యువకుడిపై లాఠీతో దాడి చేసిన ఘటన తిరుపతిలో కలకలం సృష్టించింది.. రక పవన్ అనే యువకుడు బైక్‌ను రెంట్‌కు తీసుకుని అద్దె చెల్లించకపోగా.. ఆ బైక్‌ను తాకట్టు పెట్టాడనే కారణంతో అతనిపై కొందరు దాడి చేశారు. దీనికి సంబంధించి బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనిల్‌రెడ్డి, జగ్గారెడ్డి అలియాస్ జగదీష్, దినేష్ అనే ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో.. అనిల్‌రెడ్డి, జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకోగా.. దినేష్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. దాడి చేసినవారిపై కిడ్నాప్, హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు తిరుపతి ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం. బైక్ రెంట్ విషయంలోనే పవన్‌పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని చెప్పారు. దినేష్‌ను అదుపులోకి తీసుకుంటే దాడి ఘటనలో మరింత క్లారిటీ వస్తుందని చెప్పారు.
ఇదిలావుంటే.. ఈ ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన బాధితుడు పవన్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఆసక్తిగా మారింది. తాను బ్రేక్ దర్శనాలు, ఉద్యోగాల పేరుతో మోసం చేయడంతోనే కొంతమంది దాడి చేశారన్నారు. ఈ ఘటనలో వైసీపీ, టీడీపీకి సంబంధం లేదని చెప్పారు.
బాధితుడు వర్షెన్ ఇలా ఉంటే.. తల్లిదండ్రుల వర్షన్ మరోలా ఉంది. పవన్‌పై వైసీపీ చెందినవారే దాడి చేశారని ఆరోపించారు బాధితుడు పవన్ తల్లి. ఐదు లక్షలు ఇవ్వకుంటే కిడ్నీలు అమ్మేస్తామని నిన్న ఫోన్ చేసి కొందరు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
వీడియో చూడండి..
తిరుపతిలో కొద్దిరోజులుగా కొందరు రెచ్చిపోతున్నారని.. ఇలాంటి ఘటనలను సహించేదిలేదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. పవన్‌పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించేలా తిరుపతి ఎస్పీని ఆదేశించామని ఆయన తెలిపారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడియుజం చేయడం ఉపేక్షిచమన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. తిరుపతిలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారని రౌడీయిజానికి పాల్పడుతున్నారని విమర్శించారు. పవన్ పై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
ఈ మొత్తం కేసులో మరో ట్విస్ట్ చర్చనీయాంశం అవుతోంది. బాధితుడిపై దాడి చేసినవారికి లాఠీ ఎక్కడి నుంచి వచ్చింది?.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ లాఠీకి సంబంధించి కూడా తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..