తాజాగా, కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి. నడ్డా ఇటీవల లోక్‌సభలోనూ ఇదే చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో చేసిన పరిశోధనలో 84 శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో ఫ్యాటీ లివర్ సమస్య ఉందని, ప్రతి 100 మందిలో 71 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. అధ్యయనం జరిపిన 345 మంది ఐటీ ఉద్యోగుల్లో 34 శాతం మందికి మెటబాలిక్ సిండ్రోమ్, 84 శాతం మందిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు నిర్ధారణ అయినట్లు మంత్రి వెల్లడించారు. ఇది ఐటీ రంగంలో ఆరోగ్య సమస్యలు ఎంత తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయో సూచిస్తుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ICMRతో కలిసి “ఇండియన్ మెటబాలిక్ అండ్ లివర్ డిసీజ్ ఫేజ్-1” కింద చేసిన అధ్యయనంలో ఈ వ్యాధులు బయటపడ్డాయని నడ్డా చెప్పుకొచ్చారు. ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’ అనే జర్నల్‌లో రీసెర్చ్ ఫలితాలు ప్రచురితమయ్యాయి. కాగా, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్నియంత్రణ కోసం ఐసీఎంఆర్ కొన్ని సూచనలు చేసింది. ఐటీ ఉద్యోగులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, జంక్ ఫుడ్, అధిక ఆయిల్ ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలని సంస్థ సూచించింది. రోజూ అరగంట పాటైనా వ్యాయామం చేసి.. బరువును నియంత్రణలో ఉంచుకోవాలని, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు అవసరమని కూడా సంస్థ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందటం.. ఇక ఈజీ కాదు
గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండా 3115 రైల్వే ఉద్యోగాల భర్తీ
‘దేవుడి దగ్గరికి వెళ్తున్నా..’ ఐదో అంతస్తు నుంచి దూకిన మహిళ
రోజుకు రూ. 411 కడితే.. చేతికి రూ.43 లక్షలు.. ఈ అదిరిపోయే స్కీమ్ ఏదంటే..
మయసభ రివ్యూ.. పొలిటికల్ డ్రామా ఎలా ఉందంటే?