సినీరంగంలో ఎంత ఎక్కువ మంది తారలు కీర్తిని పొందుతారో.. అంతే తక్కువ సమయంలో ఇండస్ట్రీ నుంచి కనుమరుగవుతుంటారు. అలాగే ఈ రంగుల గ్లామర్ ప్రపంచంలో కనిపించే తారలు అందరూ విలాసవంతమైన లగ్జరీ లైఫ్ గడపలేరు. ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఓ హీరోయిన్.. జీవితం ఎవరూ ఊహించని విధంగా విషాధగాథగా మారింది. అగ్ర కథానాయికగా చేతినిండా సినిమాలతో దూసుకుపోయిన ఆ హీరోయిన్.. చివరి సంవత్సరాల్లో మాత్రం మద్యపానం, దివాలా కారణంగా విషాదకరంగా మరణించింది. ఆమె ఎవరో మీకు తెలుసా.. ? సాధారణంగా చిన్న వయసులోనే కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత వివాహం చేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత నటిగా సినీప్రయాణం మొదలుపెట్టింది.
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..
ఆమె పేరు విమి. పంజాబ్ లో జన్మించిన ఆమె.. శివ్ అగర్వాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఆమెకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దీంతో కుటుంబంతో కలిసి ముంబైలో సెటిల్ అయ్యింది. 1967లో వచ్చిన హమ్రాస్ సినిమాతో విమి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్స్.. సునీల్ దత్, శశి కపూర్, రాజ్ కుమార్ వంటి పెద్ద హీరోలతో కలిసి నటించింది. 1960లోనే ఒక్కో సినిమాకు రూ.3 లక్షలు పారితోషికం తీసుకుందట. అప్పట్లోనే స్విమ్ షూట్ ఫోటోషూట్ ద్వారా వార్తలలో నిలిచింది. అయితే నటిగా కెరీర్ సాఫీగా సాగినప్పటికీ మొదటి భర్తతో గృహహింస ఎదుర్కొంది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడింది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఓ నిర్మాతతో ప్రేమలో పడిన తర్వాత ఆమె జీవితం మలుపు తిరిగింది. అప్పట్లో తన ప్రియుడు ఆమెను వ్యభిచారంలోకి నెట్టాలని ప్రయత్నించాడని.. దీంతో అతడి నుంచి విడిపోయి ఒంటరిగా ప్రయాణం స్టార్ట్ చేసింది. సినిమాలతోపాటు వ్యాపారరంగంలోకి అడుగుపెట్టింది. కానీ అందులోనూ ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో అప్పుల్లో కూరుకుపోయింది. 30 ఏళ్ల వయసు రాకముందే మధ్యానికి బానిసయ్యారు. 34 ఏళ్ల వయసులోనే కాలేయ సమస్యతో బాధపడుతూ మరణించింది. ఆమె మరణించిన సమయంలోకేవలం న చెల్లెలు మాత్రమే పక్కన ఉంది. డబ్బులు లేకపోవడంతో చేతి బండిలో స్మశానవాటికకు తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..