Visakhapatnam Gas Cylinder Blast,విశాఖలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి – at least three killed and four severely injured in gas cylinder blast at visakhapatnam brk
ప్రమాదవశాత్తూ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయి.. ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో సమీపంలోని ఉన్నవారు తీవ్రంగా గాయపడగా… వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కొందర్ని ఆసుపత్రికి తరలించగా.. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ దుర్ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది.
సిలిండర్ ప్రమాదం (ఫోటోలు– Samayam Telugu)
విశాఖలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఫిషింగ్ హార్బర్ సమీపంలో హిమాలయ బార్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వెల్డింగ్ షాప్‌లో ఆక్సిజన్ సిలెండర్ లీక్ అయి.. భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో పేలుడు ధాటికి షాపులోని ఉన్న వ్యక్తులు తునాతునకలయ్యారు. స్పాట్‌లోనే ముగ్గురు చనిపోగా.. గాయపడినవారిని చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలిలో భయానక వాతావరణం నెలకుంది. మృతదేహాలు తునాతునకలై.. ఎగిరిపడ్డ మాంసం ముద్దులతో అక్కడ దృశ్యాలు ఒళ్లు గగ్గొర్పాటుకు గురిచేస్తున్నాయి. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తెగిపడి చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్దారించారు. పేలుడు ధాటికి షాపు పూర్తిగా ధ్వంసమైంది.
రచయిత గురించిఅప్పారావు జివిఎన్జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన జాతీయ, అంతర్జాతీయ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కథనాలు, రాజకీయాలతో పాటు ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.గతంలో ప్రముఖ మీడియా సంస్థలో ఎడ్యుకేషన్ డెస్క్‌లో పనిచేశారు. ముఖ్యమైన సందర్భాల్లో లైవ్ బ్లాగ్, లైవ్ పేజీల ద్వారా పాఠకులకు నిరంతరాయంగా సమాచారం అందించిన అనుభవం ఆయనకు ఉంది. లోక్‌సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు టర్మ్‌లు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. గతంలో రాశి ఫలాలు, ఆధ్యాత్యిక వార్తలు, పండుగలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను ఆయన అందించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి జీవీఎన్ అప్పారావు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు.… ఇంకా చదవండి