Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

APPSC Jobs 2025: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ మరో కీలక అప్‌డేట్‌.. వారికి ఆగస్టు 19న ఛాన్స్‌!

7 August 2025

బాబోయ్‌ బ్రోకలీ మాకొద్దని పారిపోతున్నారా..? మీకే నష్టం.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

7 August 2025

Health Tips: ఉదయం టిఫిన్ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? పెద్ద కథే ఉందిగా..

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nara Lokesh Tweet,Nara Lokesh: పోలీసులు రఫ్పాడిస్తారు.. పుష్ప రప్పా రప్పా డైలాగ్‌పై మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్ – andhra pradesh minister nara lokesh fire on ycp leaders who are attack on youth in tirupati
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh Tweet,Nara Lokesh: పోలీసులు రఫ్పాడిస్తారు.. పుష్ప రప్పా రప్పా డైలాగ్‌పై మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్ – andhra pradesh minister nara lokesh fire on ycp leaders who are attack on youth in tirupati

.By .7 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nara Lokesh Tweet,Nara Lokesh: పోలీసులు రఫ్పాడిస్తారు.. పుష్ప రప్పా రప్పా డైలాగ్‌పై మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్ – andhra pradesh minister nara lokesh fire on ycp leaders who are attack on youth in tirupati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Nara Lokesh: దళిత యువకుడిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారని వైరల్ అవుతున్న వీడియోను షేర్ చేసిన.. మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ చేసిన ఆగడాలు భరించలేని ఏపీ ప్రజలు.. అధికారం నుంచి దించేసినా.. వారి తీరు మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అంటే.. పోలీసులు రఫ్పాడిస్తారని హెచ్చరికలు చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఘటనలను నారా లోకేష్ గుర్తు చేశారు.

పోలీసులు రఫ్పాడిస్తారు.. పుష్ప రప్పా రప్పా డైలాగ్‌పై మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్
పోలీసులు రఫ్పాడిస్తారు.. పుష్ప రప్పా రప్పా డైలాగ్‌పై మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్ (ఫోటోలు– Samayam Telugu)
Nara Lokesh : పుష్ప-2 సినిమాలోని రప్పా.. రప్పా డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ డైలాగ్ ఒక్క సినిమాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో గత కొంత కాలంగా బాగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు.. ఈ రప్పా రప్పా డైలాగ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆ మధ్య మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో రప్పా రప్పా డైలాగ్ రాసి ఉంచారని.. కేసులు పెట్టినట్లు వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. దీంతో ఏపీలో ఇప్పుడు రప్పా రప్పా డైలాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. అయితే అలాంటి డైలాగ్‌పై తాజాగా మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రప్పా రప్పా అంటే.. ఏపీ పోలీసులు రఫ్పాడిస్తారు అంటూ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ పోస్ట్ బాగా వైరల్‌గా మారింది.

“ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నాయకుల బుద్ధి మారడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకూ దళితులపై దమనకాండ జరిపిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు. తిరుపతిలో దళిత యువకుడిపై వైసీపీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి దాడులకు ఏపీలో చోటు లేదు. రప రపా అంటే ఏపీ పోలీస్ రఫ్ఫాడిస్తారు!” అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ఒక యువకుడిని కొంతమంది కొడుతున్నట్లు ఉన్న వీడియోను ట్యాగ్ చేశారు.

తిరుపతిలో ఒక యువకుడిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దాడి చేసి, రెచ్చిపోతుండటంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. వైసీపీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదని.. అధికారం పోయినప్పటికీ అదే రీతిలో దాడులు చేస్తున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

తిరుపతిలోని శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న దుకాణం కాంట్రాక్ట్‌ను తమకు రాసి ఇవ్వాలంటూ వైసీపీ సోషల్‌ మీడియా ఇంఛార్జ్ అనిల్ రెడ్డి బుధవారం రాత్రి దౌర్జన్యానికి దిగారు. ఎంఆర్‌పల్లిలోని పవన్‌ అనే యువకుడిని కిడ్నాప్ చేసి చిత్ర హింసలకు గురి చేశారు. అయితే పవన్‌ను లాఠీతో ఇష్టం వచ్చినట్లు కొడుతుండగా.. అనిల్ రెడ్డి ఫ్రెండ్స్ తీసిన వీడియో బయటికి రాగా.. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు.. భూమన కరుణాకర్‌రెడ్డి అనుచరులు చేస్తున్న ఆగడాలపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. రౌడీ రాజకీయం చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. ఎలాంటి వారైనా చట్టం ముందు సమానమేనని తేల్చి చెప్పారు.

శివరామచారి తాటికొండ

రచయిత గురించిశివరామచారి తాటికొండశివరామచారి తాటికొండ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ట్రెండింగ్ టాపిక్స్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలను శివరామచారి అందిస్తుంటారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై ఫ్యాక్ట్‌చెక్‌ వార్తలు రాసిన అనుభవం ఉంది. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV సంస్థలో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి