నటుడు బాబీ డియోల్… ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమైన బాబీ డియోల్.. లైఫ్ టర్నింగ్ అయిన సినిమా యానిమల్. చాలా కాలం తర్వాత ఈ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఒక్క డైలాగ్ కూడా లేకుండానే విలన్ పాత్రలో ఇరగదీశాడు. దీంతో పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యాడు. యానిమల్ సినిమాతో హిందీలోనే కాకుండా తమిళం, తెలుగు, కన్నడ భాషలలో పాపులర్ అయ్యాడు. దీంతో ఇప్పుడు ఆయనకు భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమాలో కనిపించారు. ఇక ఇప్పుడిప్పుడే వరుస సినిమాల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే.. బాబీ డియోల్ ఫ్యామిలీ గురించి కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ముఖ్యంగా ఆయన సతీమణి ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఒక బర్త్ డే పార్టీలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆమె అందానికి సెలబ్రెటీస్, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇటీవల ముంబైలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు బాబీ డియోల్ తన భా్య తాన్య డియోల్ తో కలిసి హాజరయ్యారు. ఇక్కడ ఆమె అందరి లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ ఆశ్చర్యపరిచింది.
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..
ఈవేడుకలో పాస్టెల్ టై అండ్ డై.. పింక్, నారింజ, నీలం, పసుపు, ఊదా ఇలా అన్ని రంగుల కలయికలో ఉన్న అందమైన డ్రెస్ లో కనిపించారు. ఈ వేడుకలో బాబీ డియోల్, అతడి భార్య తాన్య డియోల్ సింపుల్ , స్టైలీష్ లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదిలా ఉంటే.. బాబీ డియోల్ ఇప్పుడిప్పుడే చేతినిండా సినిమాలతో బిజీ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..