సిలిండర్ పేలడంతో ముగ్గురు మరణించి, మరో ముగ్గురు స్థానికులు తీవ్రంగా గాయపడిన ఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగు చూసింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిషింగ్ హార్బర్ సమీపంలోని స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ పనుల కోసం ఉపయోగించే సిలిండర్లు ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించామని తెలిపారు.
అయితే ప్రమాదం ధాటికి చనిపోయిన వారి మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోవడంతో వారిని గుర్తించడం కష్టతరంగా మారినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న నగర సీపీ శంఖబ్రత బాగ్చి ఆసుపత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న బాధితుల పరామమర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనతరం ఆయన ప్రమాదంపై మాట్లాడుతూ.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సిలిండర్ పేలుడుకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.