టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మల్లేశం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఫస్ట్ మూవీతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అటు హీరోయిన్ గా.. ఇటు సైడ్ క్యారెక్టర్స్ పోషిస్తూ బిజీగా మారింది. ఇప్పుడిప్పుడే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పిస్తుంది. గతేడాది తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్ వంటి సినిమాలతో అలరించింది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. అటు సంప్రదాయ లుక్కులో కనిపిస్తూనే.. మోడ్రన్, గ్లామరస్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది ఈ వయ్యారి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా పట్టు లంగావోణిలో ఒంటినిండా నగలతో ఎంతో అందంగా ముస్తాబయ్యింది. ఆ ఫోటోలలో అచ్చ తెలుగింటి ఆడపిల్లలా.. కుందనపు బొమ్మలా కనిపిస్తుంది. ప్రస్తుత అనన్య షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం అనన్య చేతిలో ఒకటి రెండు ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముద్దుగుమ్మకు మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు సమాచారం. అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన అనన్య.. సహజ నటనతో తెలుగు వారి హృదయాల్లో చోటు సంపాదించుకుంది.