Kota vinutha gets Bail in Driver Rayudu murder case:డ్రైవర్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంఛార్జి కోట వినుతకు బెయిల్ లభించింది. ఈ కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో ముగ్గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జూలై నెలలో ఈ అరెస్ట్ జరగ్గా.. అప్పటి నుంచి కోట వినుత జైలులో ఉన్నారు. తాజాగా ఆమె బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపిన చెన్నై సెషన్స్ కోర్టు.. కోట వినుతకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

** వినుతపై రాయుడు చెల్లెలు ఆరోపణలు..
అయితే ఈ కేసులో కోట వినుత దంపతులను జూలై నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోట వినుత బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపిన చెన్నై సెషన్స్ కోర్టు.. ఆమెకు బెయిల మంజూరు చేసింది. కోట వినుతకు ఆగస్ట్ 6వ తేదీ చెన్నై సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చినట్లు తెలిసింది. తాము అనుమతించే వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆగస్ట్ 7, 8వ తేదీలలో కోట వినుత పోలీస్ స్టేషన్లలో సంతకాలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జూలై 8వ తేదీన చెన్నైలోని కూవం నది వద్ద ఓ మృతదేహాన్ని చెన్నై పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యా్ప్తు జరిపిన పోలీసులు.. ఈ వ్యవహారంలో కోట వినుత సహా ఐదుగురిని అరెస్టు చేశారు.
Srikalahasti Rayudu murder: మా అన్నను చంపింది వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలి.. రాయుడు చెల్లెలు
చనిపోయింది శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెనికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడిగా గుర్తించారు. రాయుడు కోట వినుత దంపతుల వద్ద డ్రైవర్‌గా పనిచేస్తుంటారని తెలిసింది. దీంతో ఈ కేసులో కోట వినుత, చంద్రబాబు, కారు డ్రైవర్ షేక్ దాసన్, సహాయకుడు గోపి, శివకుమార్‌లను అరెస్టు చేశారు. జూలై 7వ తేదీ శ్రీనివాసులు అలియాస్ రాయుడును హత్య చేసి.. మృతదేహాన్ని కారులో చెన్నైకు తరలించి, కూవం నది వద్ద పారేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత కోట వినుతను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. ఇంఛార్జి పదవి నుంచి తప్పించింది.