ఎన్నికల్లో హామి ఇచ్చిన విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి అయినా ఉచితంగా ప్రయాణించొచ్చు. అందుకోసం ఆధార్ కార్డు చూపిస్తే సరి. కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారు. అయితే ఇటీవల ఈ పథకానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అర్హులు ఆధార్ కార్డ్స్ అప్ డేట్ చేయకుంటే.. జీరో టికెట్స్ ఇవ్వలేం అని.. కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ కారణంగా ప్రయాణించే మహిళలు, ఆర్టీసీ కండెక్టర్ల మధ్య వాగ్వాదాలు కామన్ అయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి సంబంధించి అధికారులు కీలక సూచనలు చేశారు.
రాష్ట్రంలో చాలామంది వినియోగిస్తున్న ఆధార్ కార్డ్ మీద రాష్ట్రం పేరు వద్ద ఆంధ్రప్రదేశ్ అనే ఉంది. ఆ ఆధార్ కార్డులను రాష్ట్రం విడిపోకముందు జారీ అయినవి కావడంతో.. అవి అప్పటి నుంచి అలానే ఉన్నాయి. దీంతో వాటిని అప్ డేట్ చేయించి.. అక్కడ తెలంగాణ అని మార్చాలని.. అలా అయితే జీరో టికెట్స్ జారీ చేస్తామని కండక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆధార్ కార్డ్స్‌పై ఫోటోలు అప్ డేట్ చేయించడం లేదు. ఏప్పుడో 10, 15 ఏళ్ల క్రితం కార్డు జారీ చేసిన సమయంలో ఉన్ ఫోటోలే ఉన్నాయి. దీంతో కండక్టర్లు ప్రయాణించేవారిని అప్పటి ఫోటోలతో పోల్చలేకపోతున్నారు. దీంతో టికెట్లు ఇవ్వమని కండక్టర్లు చెప్పడం.. ఎందుకు ఇవ్వరని మహిళలు గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు బాగానే పని చేశాయి కదా.. ఇప్పడేంటి సమస్య అని కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డ్స్ అప్ డేట్ చేసుకోవడం చాలా సులభమైన పని అని.. అది చేయకుండా ఆర్టీసీ సిబ్బందితో దురుసుగా వ్యవహరించడం.. దుర్భాషలాడటం కరెక్ట్ కాదన్నది ఆర్టీసీ వెర్షన్. అందుకు అప్ డేట్ చేస్తేనే మంచిదని వారి సూచన.
కాగా ఆధార్ కార్డ్స్‌ను రెండు రకాలుగా అప్ డేట్ చేసుకోవచ్చు. అడ్రస్ మార్చాలనుకుంటే.. ఆధార్ సెంటర్లలో లేదా ఆన్‌లైన్‌లో ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా ఛేంజ్ చేయవచ్చు. ఇక ఫొటో, బయోమెట్రిక్ అప్డేట్ కోసమైతే ఆధార సెంటర్లకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..