Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఒక్క ఫోన్‌తో జీవితం ఛిన్నాభిన్నం

8 August 2025

Today Rain,Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. ఈ ప్రాంతాలలో భారీ వానలు.. జాగ్రత్త! – weather update apsdma predicts moderate to heavy rains on saturday in andhra pradesh

8 August 2025

Kavya Maran: కావ్య పాపకు భారీ లాభాలు తెచ్చిపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. కానీ అక్కడ మాత్రం నష్టాలే..

8 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ys Sharmila On Ysrcp,YS Sharmila: వైసీపీకి, వైఎస్సార్‌కు ఏం సంబంధం.. పేరు పెడితే వారిదే పేటెంట్ రైటా? – apcc chief ys sharmila reaction on ysr statue issue in nandigama
ఆంధ్రప్రదేశ్

Ys Sharmila On Ysrcp,YS Sharmila: వైసీపీకి, వైఎస్సార్‌కు ఏం సంబంధం.. పేరు పెడితే వారిదే పేటెంట్ రైటా? – apcc chief ys sharmila reaction on ysr statue issue in nandigama

.By .8 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ys Sharmila On Ysrcp,YS Sharmila: వైసీపీకి, వైఎస్సార్‌కు ఏం సంబంధం.. పేరు పెడితే వారిదే పేటెంట్ రైటా? – apcc chief ys sharmila reaction on ysr statue issue in nandigama
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


YS Sharmila on YSR Statue issue Nandigama: నందిగామ సెంటర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగింపుపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీపై కోపం ఉంటే వైఎస్సార్ విగ్రహం ఏం చేసిందని షర్మిల ప్రశ్నించారు. అసలు వైసీపీకి, వైఎస్ఆర్‌కు సంబంధం లేదన్న షర్మిల.. పార్టీకి పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్‌పై వారిదే పేటెంట్ రైటా అంటూ ప్రశ్నించారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని వెంటనే పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

వైసీపీకి, వైఎస్సార్‌కు ఏం సంబంధం.. పేరు పెడితే వారిదే పేటెంట్ రైటా?
వైసీపీకి, వైఎస్సార్‌కు ఏం సంబంధం.. పేరు పెడితే వారిదే పేటెంట్ రైటా? (ఫోటోలు– Samayam Telugu)
YS Sharmila on YSR Statue issue Nandigama: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. జాతీయ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకూ.. సమకాలీన అంశాల మీద వేగంగా స్పందిస్తూ ఉంటారు. ఇటు అధికార తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి.. అటు విపక్ష వైసీపీ వరకూ పలు అంశాల మీద విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా నందిగామ సెంటర్లో జరిగిన ఓ ఘటనపై వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. నందిగామ సెంటర్‌లో ఉన్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ షర్మిల.. ఈ క్రమంలోనే వైసీపీకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఏం సంబంధం ఉందంటూ ట్వీట్ చేశారు.

“కూటమి ప్రభుత్వం వైసీపీపై కోపాన్ని వైఎస్సార్ గారి విగ్రహాల మీద చూపిస్తారా ? అసలు YCPకి YSRకి ఏం సంబంధం ? మహానేత పేరు పెట్టినంత మాత్రాన YSR ఏమైనా వారి సొత్తా.. లేక పేటెంట్ రైటా ? YSR గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. చివరి క్షణం దాకా తన జీవితాన్ని ప్రజల కోసమే త్యాగం చేసిన ప్రజా నాయకుడు. తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర. సంక్షేమ పథకాల అమలులో ఈ దేశానికి దిశా నిర్దేశం YSR గారు. ప్రజాక్షేమమే పరమావధిగా చివరి దాకా పరితపించిన గొప్ప వ్యక్తి. ఇంతటి ప్రజాభిమానం కలిగిన నాయకుడికి నీచ రాజకీయాలు చేసే వారితో కలిపి ఆపాదిస్తారా ? ఆయన విగ్రహాల మీద కక్ష రాజకీయాలు చేస్తారా ? ఇదెక్కడి దిక్కుమాలిన చర్య?” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

నందిగామ గాంధీ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమన్న వైఎస్ షర్మిల.. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ మరణం తర్వాత నందిగామ గాంధీ సెంటర్ వద్ద నాటి ప్రభుత్వం YSR విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు వైఎస్ షర్మిల గుర్తు చేశారు.

వైఎస్సార్ విగ్రహం చుట్టూ వైసీపీ అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగిస్తే అభ్యంతరం లేదన్న షర్మిల.. కానీ ఇదే సాకుగా వైఎస్సార్ విగ్రహం మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. వైసీపీకి, వైఎస్సార్‌కు సంబంధం లేదన్న షర్మిల.. తొలగించిన చోటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. గతంలో వీడియో టీమ్‌లో పని చేసిన వెంకటరమణకు స్పోర్ట్స్ న్యూస్ రాసిన అనుభవం కూడా ఉంది. జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటరమణ గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో నేషనల్. ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి