
డయాబెటిస్ ఉన్నవారి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోకపోతే అది అనేక వ్యాధులకు దారితీస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సులభమైన, ప్రభావవంతమైన ఇంటి నివారణ దాల్చిన చెక్క. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా తగ్గించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. దాల్చిన చెక్క నీటిని తయారు చేయడానికి సరైన పద్ధతి, తీసుకునే ఒక నిర్దిష్ట సమయం ఉంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…
ఆయుర్వేదంలో, దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ఔషధంగా పిలుస్తారు. దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇందుకోసం దాల్చిన చెక్క నీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
దాల్చిన చెక్క నీరు:
ముందుగా ఒక గ్లాసు నీటిని మరిగించాలి. ఈ నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి తాగాలి.
దాల్చిన చెక్క ప్రయోజనాలు:
ఈ మసాలా దినుసులో సిన్నమాల్డిహైడ్ వంటి క్రియాశీల సమ్మేళనాలు ఉంటాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇది శరీర కణాలు గ్లూకోజ్‌ను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దాల్చిన చెక్క రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. గోరువెచ్చని నీటితో దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. సమతుల్య పరిమాణంలో తీసుకోవడం వల్ల డయాబెటిస్ రోగులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, రాగి, జింక్, విటమిన్లు, నియాసిన్, థియామిన్, లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటితో దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది. అంతేకాదు.. మహిళల్లో ఎదురయ్యే పీరియడ్స్ సమస్యలు, కడుపు నొప్పికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎప్పుడు తినాలి?:
ఉదయం ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలా కుదరకపోతే.. మీరు భోజనం తర్వాత కూడా దాల్చిన చెక్క నీరు తీసుకోవచ్చునని చెబుతున్నారు.. అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, దాల్చిన చెక్క నీరు త్రాగే ముందు మీ వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. ఎందుకంటే దాల్చిన చెక్క నీటితో మందులకు ప్రతి చర్య జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..