సూపర్ స్టార్ రజీనికాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న లేటేస్ట్ మూవీ కూలీ. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇందులో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు ముఖ్య పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా.. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. కూలీ సినిమాతోపాటు అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు నాగార్జున. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియో షేర్ చేశారు. అదెంటంటే.. నాగార్జున ఎవర్ గ్రీన్ కల్ట్ మూవీ శివ చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఇవి కూడా చదవండి
అక్కినేని నాగార్జున, ఆర్జీవీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శివ. 1990లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే 35 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రోజులను గుర్తుచేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు నాగార్జున. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో ఈ సినిమాను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. మొట్ట మొదటిసారి అత్యాధునిక 4కె డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఓ వీడియో షేర్ చేస్తూ శివ రీరిలీజ్ విషయాన్ని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : Suriya: ఏముందిరా.. అందమే అచ్చు పోసినట్లు.. సూర్య కూతురిని చూశారా.. ?
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా విడుదల రోజునే థియేటర్లలో శివ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అటూ కూలీ సినిమాతోపాటు ఇటు శివ ట్రైలర్ తో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు నాగ్. త్వరలోనే శివ రీరిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు. ఇక నాగార్జున ట్వీట్ కు డైరెక్టర్ వర్మ సైతం కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి : Actress : అబ్బబ్బ.. ఏం అందం రా బాబూ.. 42 ఏళ్ల వయసులో టెన్షన్ పుట్టిస్తోన్న వయ్యారి..
#50YearsOfAnnapurnaHello my friends !we are bringing back the most iconic film SHIVA🔥and for the first time time in 4K DOLBY ATMOS sound💥
SHIVA TRAILER WITH#COOLIE on 14 th August!!
Shiva the film very soon😊#Shiva4KInDolbyAtmos #AnrLivesOn #Shiva4K pic.twitter.com/tVzPEYQPTB
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2025
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?