AP Fish Andhra Shops Salons: గత ప్రభుత్వ హయాంలో కాకినాడ జిల్లాలో ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో సముద్ర ఉత్పత్తుల అమ్మకాల కోసం షాపులు ఏర్పాటు చేశారు. రాయితీపై ఇచ్చిన ఈ షాపులను కొందరు ఇతర వ్యాపారాలకు మార్చేశారు. ప్రస్తుతం చాలా దుకాణాల్లో టీ కొట్టులు, సెలూన్లు, జిరాక్స్ సెంటర్లు వెలిశాయి. రాయితీ పొందిన తర్వాత షాపుల్ని నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
హైలైట్:
- ఏపీలో ఫిష్ ఆంధ్ర షాపులు
- ఆ షాపుల్ని పూర్తిగా మార్చేశారు
- టి కోట్లు, సెలూన్లుగా మార్పు

కొన్ని చోట్ల టీటైం, ఐస్ పార్లర్‌గా మార్చారట. మరో చోట ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌గా మార్చేశారట. కొన్ని షాపుల్ని జిరాక్స్ సెంటర్ ఏర్పాటు చేశారట. కాకినాడలో ‘ఫిష్ ఆంధ్ర’ షాపుల్ని యువతకు స్వయం ఉపాధి కోసం కేటాయించారు. అయితే వాటిని కొందరు సరిగా నిర్వహించడం లేదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. రాయితీ పొందిన తరువాత షాపుల్ని నిర్వహించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తామన్నారు.
గండికోటను సందర్శించిన సీఎం చంద్రబాబు.. అబ్బో ఇన్ని సమస్యలు ఉన్నాయా!
గత ప్రభుత్వ హయాంలో కేటాయించి ఈ ఫిష్ ఆంధ్ర షాపుల్ని కొంతకాలం నిర్వహించారు.. తర్వాత వాటిని మూసివేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ షాపుల్లో వేరే, వేరే వ్యాపారాలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం రాయితీ ఇచ్చిన ఈ షాపుల్లో వేరే వ్యాపారాలు చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.