Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Health Tips: దంతాలు పచ్చగా ఎందుకు మారుతాయి..? కారణాలు తెలిస్తే అవాక్కే..

9 August 2025

Shubman Gill: జెర్సీ వేలం.. గిల్ జెర్సీకి ఎంత ధర వచ్చిందో తెలుసా..?

9 August 2025

Health Tips: రాత్రి తిన్న వెంటనే నడిస్తే ఏమవుతుందో తెలుసా..? తెలిస్తే షాకే..

9 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Purandeswari Tied Rakhi To Nandamuri Balakrishna,అక్క కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న బాలయ్య.. ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సీన్ – daggubati purandeswari tied a rakhi to her brother nandamuri balakrishna
ఆంధ్రప్రదేశ్

Purandeswari Tied Rakhi To Nandamuri Balakrishna,అక్క కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న బాలయ్య.. ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సీన్ – daggubati purandeswari tied a rakhi to her brother nandamuri balakrishna

.By .9 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Purandeswari Tied Rakhi To Nandamuri Balakrishna,అక్క కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న బాలయ్య.. ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సీన్ – daggubati purandeswari tied a rakhi to her brother nandamuri balakrishna
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Daggubati Purandeswari Tied Rakhi To Balakrishna: దేశవ్యాప్తంగా రాఖీ పండుగను అందరూ జరుపుకుంటున్న వేళ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన సోదరి, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి రాఖీ పండుగను ఎయిర్‌పోర్ట్‌లో జరుపుకున్నారు. పురందేశ్వరి బాలకృష్ణకు రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను పురందేశ్వరి స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వారి అనుబంధం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వారి అనురాగం వెండితెరపై చూడముచ్చటగా ఉంది.

హైలైట్:

  • నందమూరి బాలయ్య రాఖీ పండుగ
  • బాలయ్యకు రాఖీ కట్టిన సోదరి పురందేశ్వరి
  • వీడియోను ట్వీట్ చేసిన రాజమండ్రి ఎంపీ
బాలయ్యకు రాఖీ కట్టిన పురందేశ్వరి
బాలయ్యకు రాఖీ కట్టిన పురందేశ్వరి (ఫోటోలు– Samayam Telugu)
దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఘనంగా జరుగుతోంది.. మహిళామణులు వారి సోదరులకు రాఖీలు కట్టి పండుగ చేసుకున్నారు. అయితే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన సోదరితో కలిసి రాఖీ పండుగ చేసుకున్నారు. బాలయ్యకు సోదరి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టారు. ఆ తర్వాత బాలకృష్ణ తన అక్క కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.. అనంతరం ఇద్దరు స్వీట్‌లు తినిపించుకున్నారు. ఈ వీడియోను దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా ట్వీట్ చేశారు. అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు కూడా తెలిపారు. బాలయ్య, పురందేశ్వరి ఎయిర్‌పోర్ట్‌లో వేడుకలు చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. రాఖీ కట్టిన తర్వాత అక్కకు డబ్బులు ఇవ్వాలంటూ నందమూరి బాలయ్య సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ఇవాళ రక్షాబంధన్.. నా మనసుకు చాలా దగ్గరైన పండుగ. ఇవాళ నేను నా తమ్ముడి చేతికి రాఖీ కట్టను. తమ్ముడు ఆరోగ్యంగా, సంతోషంగా, జీవితంలో ప్రతి కల నిజం కావాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళకు శుభాకాంక్షలు.. జీవితంలో మీరు నాకు అండగా ఉన్నారు. మంచి స్నేహితులుగా ఉన్నారు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీ కలలను నెరవేర్చుకోవడానికి శక్తిని పొందాలని.. ప్రతి అడుగులో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మనమందరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. భవిష్యత్తులో కూడా సంతోషంగా, ప్రేమగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు పండుగ జరుపుకుంటున్న తోబుట్టువులందరికీ శుభాకాంక్షలు. మీ బంధం రోజురోజుకూ బలపడాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలోని ప్రతి అక్కచెల్లెళ్ళకు, అన్నదమ్ములకు నా ప్రేమ, ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ జీవితంలో అన్నీ శుభాలే కలగాలని ఆశిస్తున్నాను. రక్షాబంధన్ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.

Hindupur: షూటింగ్‌లో బాలయ్య.. రంగంలోకి వసుంధర.. స్ట్రాటజీ మామూలుగా లేదుగా!

నందమూరి, దగ్గుబాటి కుటుంబాలు అప్పుడప్పుడు కలుస్తుంటాయి.. నందమూరి బాలయ్యతో పాటూ కుటుంబ సభ్యులు ఫ్యామిలీ ఫంక్షన్‌లు మాత్రమే కాదు.. ఒకటి, రెండు సందర్భాల్లో సంక్రాంతి పండుగ సమయంలో బాపట్ల జిల్లా కారంచేడులోని దగ్గుబాటి పురందేశ్వరి నివాసానికి వెళ్లారు. పండగ రోజుల్లో అక్కడే ఉన్నారు.. సందడి చేశారు. ఇప్పుడు రాఖీ ఇలా జరుపుకున్నారు.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, తిరుమల అప్డేట్స్, ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 13 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు, పొలిటికల్ న్యూస్ రాశారు. గతంలో క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం తిరుమల బాబుకు ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి మూడు ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తిరుమల బాబు జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2024లో తిరుమలబాబు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి సూపర్ స్టార్ అవార్డును అందుకున్నారు.… ఇంకా చదవండి