టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో, నేరగాళ్లు కూడా అంతే వేగంగా తమ పద్ధతులు అప్‌డేట్ చేసుకుంటున్నారు. మొబైల్ డేటా ఆఫ్‌లో ఉన్నా, విదేశాల నుంచి మీకు ఇంటర్నెట్ కాల్ వస్తే.. అది కనెక్ట్ అవుతుంది అంటే మీరు అలెర్ట్ అవ్వాల్సిందే..! సాధారణంగా ఇలా జరగదు. కానీ సిమ్ బాక్స్ అనే టెక్నాలజీతో సైబర్ ముఠాలు దీన్ని సాధ్యంగా మార్చేస్తున్నాయి. దీంతో ఫోన్‌లోకి చొరబడి.. మీ సొమ్ము గుల్ల చేసే అవకాశముందంటున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్.
కంబోడియా, మయన్మార్, లావోస్ సరిహద్దుల్లోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతం చైనా సైబర్ గ్యాంగుల అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి చేసే అంతర్జాతీయ కాల్స్‌ను VoIP టెక్నాలజీతో లోకల్ కాల్స్‌లా మార్చి మన దేశానికి పంపిస్తున్నారు. దీంతో లైసెన్స్ ఉన్న అంతర్జాతీయ టెలికాం నెట్‌వర్క్‌ను తప్పించేసి, కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నారు.
ఈ గ్యాంగులు అస్సాం, మణిపూర్, నాగాలాండ్‌ల నుంచి వందల సంఖ్యలో సిమ్ కార్డులు సేకరిస్తారు. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ఏజెంట్లకు పంపిస్తారు. ఒక సిమ్ బాక్స్‌లో 16 నుంచి 1,024 సిమ్‌లు అమర్చవచ్చు. అంటే ఒకేసారి వెయ్యి మందికి పైగా కాల్స్, ఎస్ఎంఎస్‌లు పంపడం వీలవుతుంది. విదేశాల నుంచి వచ్చిన కాల్ కూడా లోకల్ నంబర్‌లా కనిపిస్తుంది. ఫోన్ డేటా ఆఫ్‌లో ఉన్నా కనెక్ట్ అవుతుంది. బ్యాంకు డీటెయిల్స్, ఓటీపీలు దొంగిలించడమే వీరి ప్రధాన లక్ష్యం.
ఈ జాగ్రత్తలు పాటించండి..
No Number అని స్క్రీన్‌పై కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.
+91 కాకుండా వేరే కోడ్ ఉన్న నంబర్లను జాగ్రత్తగా చెక్ చేయాలి.
లోకల్ నంబరులా ఉన్నా, డబ్బు లేదా బ్యాంకు వివరాలు అడిగితే వెంటనే కాల్ కట్ చేయాలి.
ఈ కాల్స్‌పై ఫిర్యాదు చేయాలంటే.. DoT పోర్టల్: https://sancharsaathi.gov.in/ లేదా హెల్ప్‌లైన్ నంబర్లు: 1800-110-420 / 1963కు సంప్రదించవచ్చు.
ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఈ తరహా ఫిర్యాదులు 20,323 నమోదయ్యాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..