కొందరు నెయ్యిలో వంట నూనె కలుపుతారు. మీరు వినియోగించే నెయ్యిలో నూనె కలిసిందో లేదో తెలుసుకోవాలంటే నెయ్యి వేడి చేసి ఫ్రిజ్ లో పెడితే రెండు పొరలుగా ఏర్పడితే అది కల్తీ. నెయ్యి, ఇతర నూనె వేర్వేరు పొరలుగా ఉంటే కల్తీ నెయ్యిగా అర్ధం చేసుకోవాలి.
జుట్టు గురించి ప్రత్యేకమైన సంరక్షణ మీరు తీసుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. మనం ఇంట్లో నెయ్యి ఉంటుంది. నెయ్యితో కూడా జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. నెయ్యి సమస్యల నుంచి త్వరగా ఉపశమనాన్ని అందిస్తుంది.
ఇప్పుడు చెప్పే ఈ హెయిర్ ప్యాక్ జుట్టు సమస్యలను చక్కగా తొలగిస్తుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, కొబ్బరి నూనె కావాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత దీన్ని జుట్టుకు పట్టించాలి.
ఈ హెయిర్ ప్యాక్‌ని అరగంట సేపు జుట్టుకు పట్టించి సున్నితంగా మర్దనా చేయాలి. ఓ గంట సేపు ఉంచి తల స్నానం చేయాలి. ఈ ప్యాక్ ట్రై చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.
అరచేతిలో ఒక చెంచా నెయ్యి తీసుకుని మెత్తగా రుద్దాలి. అరచేతిలో నెయ్యి కరిగితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అరచేతిలో గట్టి పదార్ధం కరగకుండా అలాగే ఉండిపోతే అందులో కల్తీ పదార్థం కలిసి ఉందని అర్ధం. అలాగే కొద్ది మొత్తంలో నెయ్యి తీసుకొని పారదర్శక సీసాలో వేయాలి. దానికి కొద్దిగా చక్కెర జోడించాలి. ఆ తర్వాత సీసా మూత మూసివేసి బాగా షేక్ చేయాలి. కాసేపటి తర్వాత సీసా అడుగున ఎర్రటి చారలు కనిపిస్తే.. ఈ నెయ్యి కల్తీ అని అర్ధం చేసుకోవాలి.