మన దంతాలు పసుపుగా మారడానికి మన అలవాట్లే కారణం అవుతాయి. సరిగ్గా బ్రష్ చేయకపోవడం లేదా తప్పుడు ఆహారపు అలవాట్లు వల్ల మన దంతాలు పసుపుగా మారుతాయి. ఈ పసుపు దంతాలు నోట్లో దుర్వాసనకు కారణమవుతాయి. ఈ కారణంగా చాలా మంది బయటకు వెళ్లాలన్నా, ఏవైనా పంక్షన్స్‌కు వెళ్లాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈ సమస్య నుంచి బయటపడేందుకు, దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ అవి మన సమస్యపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు. అయితే ఈ సమస్యకు పరిష్కారం మన వంటిట్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. మన ఇంట్లో దొరికే పసుపును రోజూ దంతాలు శుభ్రం చేసుకునేప్పుడు పేస్ట్‌లో కలుపుకోవడం ద్వారా మన దంతాలు తెల్లగా మారుతాయని చెబుతున్నారు.
మన దంతాలు శభ్రంగా తెల్లగా ఉండాలంటే ఖరీదైన ఉత్పత్తులే వాడాల్సి అవసరం లేదు.. దీని కోసం, మన ఇంట్లో దొరికే పసుపును మాత్రమే ఉపయోగిస్తే చాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం దంతాలపై ఉన్న పసుపును తొలగించి వాటిని మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా ఈ కర్కుమిన్ వాపు చిగుళ్ళు, కావిటీస్, ప్లేక్, నోటి ఇన్ఫెక్షన్లతో సహా అనేక ఇతర దంత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మన దంతాలను తెల్లగా మార్చుకోవడానికి పసుపును ఉపయోగించడం చాలా సులభం. దీని కోసం, మీరు మీ బ్రష్‌పై టూత్‌పేస్ట్‌ను తీసుకొని దానికి చిటికెడు పసుపును జోడించాలి. ఎప్పటిలాగే మీ దంతాలను బ్రష్ చేయాలి. పసుపుతో పాటు, పసుపు దంతాలను తొలగించడానికి మీరు మరికొన్ని సహజ పదార్థాలను కూడా ఉపయోగించవచ్చు. బేకింగ్ సోడా కూడా మన దంతాలను తెల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాలో తేలికపాటి రాపిడి లక్షణాలు ఉంటాయి, ఇవి దంతాలపై పేరుకుపోయిన పసుపు పొరను తొలగించడంలో సహాయపడతాయి.
(గమనిక: పైన పేర్కొన్న అంశాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, నివేదికలు, ఇంటర్‌నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందజేయపడినవి. ఈవీటిలో మీకు ఎవైనా సందేహాలు ఉంటే పాటించే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా, స్థానిక వైద్యులను సంప్రదించండి)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.