ఓ జంట వెకేషన్‌కు వెళ్లడానికి తమ ఇద్దరు కొడుకులతో కలిసి స్పెయిన్‌లోని బార్సిలోనా ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఎయిర్ పోర్టులో చెకింగ్ సందర్భంగా వారి పెద్ద కొడుకు పాస్ పోర్ట్ ఎక్స్‌పైర్ అయినట్లు వీసా రిజెక్ట్ అయినట్లు తెలిసింది. ఆ తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా పిల్లాడ్ని ఎయిర్ పోర్టులోనే వదిలేయాలని అనుకున్నారు. బంధువులకు ఫోన్ చేసి పిల్లాడ్ని తీసుకెళ్లమన్నారు. ఆ పిల్లాడు టెర్మినల్‌లోనే ఉండిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు, తమ్ముడు విమానం ఎక్కేశారు. పాపం ఆ బాలుడు టెర్మినల్‌లో ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు. ఎయిర్ పోర్టు అధికారులు బాలుడ్ని చూశారు. ఏమైందని అడిగారు. బాలుడు జరిగిందంతా వారికి చెప్పాడు. అధికారులు ఆశ్చర్యపోయారు. వెంటనే పిల్లాడి తల్లిదండ్రులు వెళుతున్న విమానం పైలట్‌ను సంప్రదించారు. ఆ పైలట్ ‘మీలో ఎవరైనా మీ పిల్లాడిని ఎయిర్ పోర్టు టెర్మినల్‌లో వదిలేశారా?’ అని మైక్‌లో ఎనౌన్స్ చేసాడు. ఇందుకు ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. అయితే, అధికారులు మాత్రం ఆ తల్లిదండ్రుల్ని గుర్తించారు. వారితో పాటు వారి చిన్న కొడుకు ఉండటంతో ఇట్టే కనిపెట్టారు. మైనర్ బాలుడిని వదిలి వెళ్లినందుకు విమానం ల్యాండ్ అయిన వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరుదైన ‘మాస్క్డ్ బూబీ’ని ఎప్పుడైనా చూసారా?
హీరోయిన్ కొత్త దందా… వీడియో కాల్‌కు 30వేలు, వాయిస్ కాల్‌కు 20 వేలు
Bigg Boss 9: బిగ్ బాస్ 9 కోసం నాగ్‌కు దిమ్మతిరిగే రెమ్యునరేషన్
Kantara: కాంతారను వెంటాడుతున్న మరణాలు
నరాలు కట్ అయ్యేంత సస్పెన్స్! ఇంతకీ ఆ హత్య చేసిందెవరు..?