తమ వేతనాలు పెంచాలని పట్టుబడుతోంది ఫెడరేషన్. అయితే, తెగేదాకా లాగితే ఏమవుతుందో ప్రాక్టికల్‌గా చూపిస్తామంటున్నారు ప్రొడ్యూసర్స్. సాఫ్ట్‌వేర్ శాలరీలిస్తున్నా ఈ గొంతెమ్మ కోరికలేంటంటూ.. మ్యాటర్‌ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎవరితో ఎలా పనిచేయించుకోవాలో తమకు బాగా తెలుసని చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తున్నారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఓ అడుగు ముందుకు వేసి అనుభవం, ప్రతిభ కలిగిన వారికి మంచి అవకాశాలు కల్పిస్తామంటూ.. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. సినిమాటోగ్రాఫీ, ఎడిటింగ్, మేకప్, అర్ట్, పొడక్షన్ సహా అనేక విభాగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ షూటింగ్స్ బంద్‌కి పిలుపునివ్వటంతో సెట్స్‌పై ఉన్న మూవీ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. షూట్ ఆగిపోవడంతో ఖర్చులు మరింత పెరుగుతాయి. సంబంధిత నటుల కాల్షీట్లు వృధా అవుతాయి, సినిమా సామాగ్రితో పాటు తదితర పనులకు అద్దెలు కూడా అదనపు భారంగా మారుతాయి. నిర్మాతలతో సినీ కార్మికుల ఫెడరేషన్ చర్చలు జరుగుతున్నాయి. కానీ ఈ చర్చలు విఫలం అయ్యాయి
ఇది కూడా చదవండి :తండ్రి స్కూల్ ముందు సమోసాలు అమ్మేవాడు.. కూతురు ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ సింగర్.
సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక ప్రతిపాదనలు జరిగాయి. రోజు వేతనం 2 వేల లోపు ఉన్నవారికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. 3 విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం తెలిపారు. తొలి ఏడాది 15 శాతం వేతనాల పెంపు, రెండు, మూడో ఏడాది 5% చొప్పున పెంపునకు అంగీకారం తెలిపారు. రోజు వేతనం రూ.వెయ్యి లోపు ఉంటే తొలిఏడాది 20 శాతం.. మూడో ఏడాది 5 శాతం వేతనం పెంచేందుకు ఒప్పుకున్నారు. షరతులకు అంగీకరిస్తేనే వేతనాల పెంపు ఉంటుందని, ఇక కార్మిక ఫెడరేషనే నిర్ణయం తీసుకోవాలి నిర్మాతలు తెలిపారు.
ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా
కాగా ఈ చర్చలు విఫలం అయ్యాయి. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించలేదు కార్మిక ఫెడరేషన్. పర్సంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ ఒప్పుకోలేదు. 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తాం, నిర్మాతల షరతులను అంగీకరిస్తాం కానీ.. అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనం పెంచాలి. యూనియన్లను విడగొట్టేలా నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. రేపటి నుంచి నిరసనలు ఉధృతం చేస్తాం మనివల్లభనేని అనిల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి