క్రెడిట్ కార్డుల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. అయితే వార్షిక ఫీజులు, రెనువల్ ఫీజులు, జాయినింగ్ ఫీజులు ఉండటం వల్ల చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకోవాలంటే ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐదు కార్డులు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎలాంటి ఫీజు ఉండదు. లైఫ్ లాంగ్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
అయితే బిల్లులు మాత్రం సకాలంలో కట్టాలి. లేకపోతే భారీ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్లకు ఉచితంగా సేవలు అందిస్తున్న ఐదు బెస్ట్ క్రెడిట్ కార్డుల గురించి ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ మెంబర్లకు ఈ కార్డు ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇతరులకు అయితే ఇది 3 శాతం. అలాగే ఈ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లకు 1 శాతం క్యాష్ బ్యాక్ అమెజాన్ పే ఖాతాలో జమ అవుతుంది.
ఫైబ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్.. ఈ కార్డు ద్వారా క్యాబ్ బుకింగ్, ఓటీటీ సబ్ స్క్రిప్షన్, ఫుడ్ డెలివరీ వంటి కేటగిరీల్లో 3 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇక రూ.2,500 దాటిన కొనుగోళ్లను వెంటనే ఈఎంఐలుగా మార్చుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ మిలేనియా క్రెడిట్ కార్డ్.. ఈ కార్డు ద్వారా ఆన్ లైన్ షాపింగ్ చేస్తే మూడు రెట్లు రివార్డు పాయింట్లు పొందవచ్చు. ఆఫ్ లైన్ షాపింగ్ లో అయితే 1X రివార్డు పాయింట్లు వస్తాయి. కార్డు పొందిన 72 గంటల్లో ఉచిత రైల్వే లాంజ్ యాక్సెస్ ఉంటుంది.
ఫెడరల్ బ్యాంక్ స్కేపియా క్రెడిట్ కార్డ్.. ఈ కార్డు ద్వారా హోటల్ బుకింగ్ పై 20 శాతం ఇన్ స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. విదేశీ లావాదేవీలకు అయితే ఎలాంటి కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలు ఉండవు. ఇక్సిగో ఏయూ క్రెడిట్ కార్డ్.. ఈ కార్డు ద్వారా రైల్ రిజర్వేషన్లు చేసుకుంటే 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక్సిగో యాప్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి మూడు నెలలకు ఓసారి ఎయిర్ పోర్టులో లాంజ్ యాక్సెస్ ఉచితంగా పొందవచ్చు.
కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలని చూస్తున్నవారు, తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు, విద్యార్థులు, ఎలాంటి ఫీజు లేకుండా శాశ్వతంగా ఉచితంగా క్రెడిట్ కార్డు కావాలకునేవారు ఈ కార్డులను పరిశీలించవచ్చు.