BAPS స్వామినారాయణ సంస్థాన్ రక్షాబంధన్ పండుగను ఆధ్యాత్మికంగా ఘనంగా నిర్వహిస్తుంది. రక్షాబంధన్ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ ఆశీస్సులు అందించారు. ‘‘రక్షా బంధన్ అనేది స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం. ఈ సందర్భంగా కట్టే రాఖీ ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. రక్షణ కోసం రాఖీ కడతారు. కానీ అందరికంటే గొప్ప రక్షకుడు దేవుడు. ఆయన ప్రజలను అనేక దుఃఖాల నుండి రక్షిస్తాడు. దీనితో పాటు అనేక భావోద్వేగాల నుంచి బయటపడేస్తాడు. కాబట్టి దేవుడిని నిరంతరం పూజించాలి. పాండవులు, ప్రహ్లాద్‌జీ సహా పలువురు ప్రముఖుల మాదిరి దేవుని ఆజ్ఞలో ఉంటే.. దేవుడు వారిని అన్ని విధాలుగా అండగా నిలిచాడు. మీరు నన్ను తలుచుకుంటే.. నేను మీకు అండగా ఉంటాను అని యోగాజీ మహారాజ్ చెప్పేవారు’’ అని తెలిపారు.
రాఖీ.. కృతజ్ఞత, నమ్మకం, రక్షణకు ప్రతీక. అందుకే అక్కచెల్లెళ్లు ఎంత దూరమున్న అన్నాదమ్ముళ్లకు తప్పక రాఖీ కడతారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాఖీల సంబరాలు సంతోషంగా సాగుతున్నాయి. ఆడబిడ్డల రాకతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. ఈ పండుగతో సామాజిక ఐక్యతతో పాటు బంధుత్వాలు బలోపేతం అవుతాయి. సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఈ పండుగ ద్వారా ప్రజలు తమ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ప్రేరణ పొందుతారు.
2025 #RakshaBandhan ✨
Prayers & Blessings by HH #MahantSwamiMaharaj, Spiritual Head of #BAPS — Swaminarayan #Akshardham, New Delhi.2025 #रक्षाबंधन ✨#BAPS के आध्यात्मिक गुरु, परम पूज्य महंत स्वामी महाराज ने आशीर्वाद एवं प्रार्थना की— #स्वामिनारायण #अक्षरधाम, नई दिल्ली pic.twitter.com/IaZfHmEVB4
— Swaminarayan Akshardham – New Delhi (@DelhiAkshardham) August 9, 2025