
తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొడుతుంది. హైదరాబాద్‌లో కుండపోత వాన కురుస్తుంది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడుతుంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, మీర్‌పేట్, ఉప్పల్, తార్నాక, అత్తాపూర్, రాజేంద్రనగర్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.