సముద్రంలో చేపలు పట్టేందుకు ఆశగా వేటకు వెళ్లారు మత్స్యకారులు.. పడవల్లో నుంచి గాలం వేస్తూ చేపల వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మత్స్యకారుల గాలానికి ఓ భారీ చేప చిక్కినట్లు అనిపించింది.. దీంతో పడవలో ఉన్న వారంతా అలర్ట్ అయ్యారు. ఎంత లాగినా.. పైకి మాత్రం రావడం లేదు.. దీంతో మరింత కష్టపడి చూశారు.. అదేంటో చూసి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది.. దాదాపు 500 కిలోలున్న సొరచేప వారి గాలానికి చిక్కింది.. ముందు ఆ భారీ సొరచేపను చూసి వారంతా భయపడ్డారు.. ఎలాగొలా బయటకు తీసుకురావాలని అనుకున్నారు.. దాంతో కుస్తీ పట్టి.. దాదాపు 5 గంటలపాటు శ్రమించి తీరానికి లాక్కొచ్చారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో చోటుచేసుకుంది.
శనివారం అనకాపల్లి పూడిమడక తీరం నుంచి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు భారీ సొర చేప చిక్కింది. గాలానికి చిక్కిన సొరచేపను చూసి ముందు భయపడిన మత్స్యకారులు 5 గంటలపాటు కష్టపడి తీరానికి లాక్కొచ్చారు. ముందుగా సొర చేపను దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు.. దానిని పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి బయటకు లాక్కొచ్చారు.

Giant Hammerhead Shark Caught
15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొర చేపను పూడిమడక తీరంలో ఇప్పటి వరకూ చూడలేదని, సాధారణంగా దీన్ని తింటారని పేర్కొంటున్నారు. దీన్ని వేలం వేయగా రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారుడు నూకరాజు తెలిపాడు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..