తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణశాఖ. తెలంగాణలో.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు, ఏపీలో.. రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. క్యుములో నింబస్ మేఘాలతో మూడ్రోజులు వర్షాలు పడతాయని చెప్పింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు.. ఉత్తర తెలంగాణకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణశాఖ అధికారులు. ఈనెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు వాతావరణ అధికారులు. రాయలసీమలో జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు. ఇక హైదరాబాద్‌లో మళ్లీ వర్షం కురిసింది. దీంతో నగరవాసుల గుండెల్లో వణుకు మొదలైంది. చాలా చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. పాతబస్తీ, చార్మినార్, చాంద్రాయణగుట్టలో వర్షం కురిసింది. బహదూర్‌పురా, గౌలిగూడ, శాలిబండ, సైదాబాద్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్‌లో వర్షం ముంచెత్తింది. బండ్లగూడ, నాంపల్లి, అంబర్‌పేట్‌లో కూడా వర్షం కురిసింది. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. మరోవైపు హిమాయత్‌సాగర్ నీటిమట్టం పెరగడంతో రోడ్లపైకి వరద నీరు చేరింది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గర రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆ ఏరియాలో రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. బారికేడ్స్ ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు దీన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్దె కొంప.. సొంత ఇల్లు.. ఏది బెటర్..?
ఒక్క క్లిక్‌తో మీ బ్యాంకు ఖాతా ఖాళీ.. జాగ్రత్త
భర్త ఆచూకీ లేదంటూ బోరున ఏడ్చిన భార్య.. చివరిలో సూపర్ ట్విస్ట్
గుండె సమస్యలను క్షణాల్లో గుర్తించే ఏఐ టెక్నాలజీ
ట్రంప్ టారిఫ్‌లపై.. సొంత పార్టీలో సెగ! భారత్‌ను దూరం చేసుకొవద్దని హితవు