
మ్యాన్ ఆఫ్ మస్సెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2, దేవర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో తారక్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై హైప్స్ తారా స్థాయికి చేరాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ సినిమా పై ఆసక్తి పెంచాయి. కాగా ఈ భారీ సినిమాను ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానులకు ఇబందులు కలగకుండా ఈవెంట్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను దక్కించుకున్నారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాను స్పెయిన్, జపాన్, అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. వార్ 2 సినిమాను రూ.210 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నయా రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు తారక్ అభిమానులు. వార్ 2లో యాక్షన్ సీన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయిని చిత్రయూనిట్ చెప్తుంది. మరి ఈ మూవీ విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.