అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో మత్స్యకారులకు భారీ సొర చేప చిక్కింది. ఏకంగా 500 కిలోల బరువైన సొర చేపను చూసి మత్స్యకారులు సైతం షాకయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి.. సొర చేపను తీరానికి లాక్కొచ్చినట్టు మత్స్యకారులు చెబుతున్నారు. మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల గాలానికి శనివారం ఓ భారీ సొర చేప చిక్కింది. 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువైన సొర చేపను చూసి తొలుత మత్స్యకారులు భయపడ్డారంట. అనంతరం, మత్స్యకారులు ఐదు గంటలపాటు కష్టపడి దానిని తీరానికి లాక్కొచ్చారు. ముందుగా సొరను దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు. పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి.. తీరానికి లాక్కొచ్చారు. పూడిమడక తీరంలో ఇప్పటి వరకూ ఇలాంటి సొర చేపను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. దీన్ని వేలం వేయగా 34 వేల రూపాయలకు ఓ వ్యాపారి కొనుగోలు చేసినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. ఇంత పెద్ద సొర చేప మత్స్యకారులకు చిక్కడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. సొర చేపను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున తీరానికి వచ్చారు. సొర నోరు తెరిచి దాని పళ్లు, లోపలి భాగాలను మత్స్యకారులు ఆసక్తిగా చూశారు. అలాగే దాని పళ్లను చెక్ చేశారు. ఈ దృశ్యాలు చాలా ఆసక్తికరంగా ఉండటంతో పిల్లలు సొర చేపను చూడటానికి ఆసక్తి కనబరిచారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
Anakapalli 500 kg Shark: అయ్ బాబోయ్ ఎంత పొడవో.. అమ్మ బాబోయ్ ఎంత పెద్దదో!
.