బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ధడక్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. టాలీవుడ్ టు బాలీవుడ్ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.
అంతే కాకుండా ఈ బ్యూటీ ఫ్యాషన్ షోల్లో కూడా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ఓ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గనుక రిలీజ్ అయితే ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కవే. ఎప్పుడు తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు పూల డిజైన్‌తో తయారు చేసిన చీరలో అదిరిపోయే స్టిల్స్‌తో తన ఫ్యాన్స్ ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం దేవర2తో పాటు ఆర్సీ 16 వంటి సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.