ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా వార్ 2. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ వేడుకకు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తోపాటు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, త్రివిక్రమ్ హజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఇది డబ్బింగ్ సినిమా కానే కాదు. ఇది పక్కా తెలుగు సినిమానే అని అన్నారు.
“నాకు ఇద్దరి ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది. అందులో ఎన్టీఆర్ ఒకరు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకొకరు. ఈ సినిమాపై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇది డబ్బింగ్ సినిమా కానే కాదు. ఇది పక్కా తెలుగు సినిమా. మూవీ కోసం థియేటర్లకు వెళ్లండి. మీరు ఎప్పుడూ చూడని విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇది తెలుగు సినిమా కాబట్టి హిందీ కంటే తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రావాలి. అది ఎన్టీఆర్ అభిమానుల బాధ్యత. ఈ రోజు ఎన్టీఆర్ అన్న మనకోసం కాలర్ ఎగరేశారు. రేపు ఇండియన్ బాక్సాఫీస్ ముందు ఆయన కాలర్ ఎగరేసేలా మనం చేయాలి” అని అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఇక్కడున్నవాళ్లంతా నాకు చాలా ఇష్టమైనవాళ్లే. నేను ఎంతో అభిమానించే వ్యక్తి నందమూరి తారకరామరావు గారు. ఆయనతో నా ప్రయాణం పాతికేళ్లు. నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్లోకి వెళ్లి చూసిన సినిమా కహా నో ప్యార్ కో. మొన్న మ్యాడ్ ఫంక్షన్ లో కలిసినప్పుడు దేవర నామ సంవత్సరంగా చెప్పాను.. ఇప్పుడు హృతిక్ తారక్ నామ సంవత్సరంగా చెప్పుకుందాం. ఈ సినిమాను మీరు ఫైట్స్, యాక్షన్ సినిమాగా కాకుండా.. అందుకు మించిన సర్ ప్రైజ్ మాత్రం ఉంది. ఎన్టీఆర్ కు ఉన్న పేరే ఎలాంటి ఎమోషన్ అయినా పండిస్తారు.. ఇదొక మంచి సినిమా అవుతుందని నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఒకరు హిమాలయ పర్వతం.. ఇంకొకరు వింధ్య పర్వతం. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం అంత సులభం కాదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Pelli Sandadi Movie: ఎన్నాళ్లకు కనిపించిందిరోయ్.. పెళ్లి సందడి సినిమాలో స్వప్నసుందరి.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా.. ?