
మోనోపాజ్.. ప్రతి మహిళ జీవితంలో ఎదురయ్యే సహజ ప్రక్రియ. ఈ సహజ ప్రక్రియ 45 నుంచి 55 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో, స్త్రీ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. అలసట, జుట్టు రాలడం, ఋతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం, ప్రతి నెలా పీరియడ్స్ రాకపోవడం, మానసిక చిరాకు, మానసిక స్థితిలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా చాలా మంది మహిళలు ఈ సమయంలో జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటారు. ఇది హార్మోన్ల మార్పుల వల్ల సహజం. కానీ మహిళలు దీనివల్ల ఎక్కువగా ఆందోళన చెందుతారు. మోనోపాజ్ సమయంలో జుట్టు రాలడాన్ని ఎలా నివారించాలి? అనే సందేహానికి నిపుణులు ఇక్కడ కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మెనోపాజ్ సమయంలో జుట్టు ఎందుకు రాలిపోతుంది?
మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినప్పుడు, ఇది జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా జుట్టు పెరుగుదల మందగిస్తుంది. జుట్టు రాలడం, సన్నబడటం వంటి మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.
జుట్టు రాలడాన్ని నివారించడానికి చిట్కాలు..
జుట్టు రాలడాన్ని నివారించడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం చాలా ముఖ్యం. ఇది చర్మ స్థితిస్థాపకత, జుట్టు పెరుగుదల, ఆర్ద్రీకరణను పెంచుతుంది. ఇది అధిక జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది తల చర్మం పొడిబారడాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు మాంసాహారులైతే, చేపలు ఎక్కువగా తినడం మంచిది.
జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యానికి విటమిన్ B7 చాలా అవసరం. దీనిని బయోటిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ B7 కెరాటిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జుట్టు మెరుపును పెంచుతుంది. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీరు బయోటిన్ ఉన్న ఆహారాన్ని తినవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.