చండీగఢ్, సెప్టెంబర్ 12: చండీగఢ్‌లో పట్టపగలు ముష్కరులు రెచ్చిపోయారు. ఓ ఇంటి పరిసరాల్లో గ్రానెట్ బాంబ్ విసిరి పరారయ్యారు. బుధవారం ఆటో రిక్షాలో వచ్చిన దుండగులు గ్రెనేడ్ విసిరి వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రానెట్ ధాటికి పేలుడు సంభవించింది. భవనం కిటికీలు ఇరిగిపోయాయి. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు చండీగఢ్ పోలీస్ PRO దల్బీర్ సింగ్ మీడియాకు తెలిపారు. నగరంలోని ఓ సంపన్న కుటుంబం నివాసం ఉంటున్న సెక్టార్ 10లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం జరగలేదు. ఎవరూ గాయపడలేదు.
ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఒకరు పేలుడు పదార్థాన్ని ఇంటిపైకి విసరగా, మిగిలిన ఇద్దరూ ఆటో ఉన్నట్లు సీసీటీవీలో కనిపించింది. అనంతరం అదే ఆటోలో ఘటనా స్థలం నుంచి తప్పించుకోవడం వీడియోలో చూడొచ్చు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక దళం, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన ఇల్లు ఓ రిటైర్డ్ పంజాబ్ పోలీసు అధికారిది కావడం విశేషం. ఆయన్ని చంపడం లక్ష్యంగా పేలుడు పదార్ధాన్ని విసిరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆయన ఇంటి ముందు వరండాలో కూర్చుని ఉన్నారు.
ఇవి కూడా చదవండి
CCTV visuals of the Sector-10 Chandigarh where an objectionable object thrown into a house led to blast. The auto-Rickshaw is seen in the video used by the suspects who throw the objectionable object in the house of Chd, Sec-10. The blast voice is too heard in the video pic.twitter.com/82Ba5tCwRX
— Akashdeep Thind (@thind_akashdeep) September 11, 2024
సీసీటీవీ ఫుటేజీ చూస్తే.. గ్రానెట్‌ను ఇంట్లోకి విసిరి, పేలుడు సంభవించేటట్లు చేయడం అనేది దుండగుల ప్లాన్. ఇంటి ముందు పడటంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. భవనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP), కన్వర్దీప్ కౌర్ మీడియాకు తెలిపారు. దుండగుల్లో ఒకరిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం పేలుడు పదార్థం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు ఆ ఇంటిపై దుండగులు వేశారనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సిఐఎస్ఎఫ్) బృందాలు క్రైమ్ స్పాట్ నుంచి నమూనాలను సేకరించారు. పేలుడు ధాటికి సుమారు 5-8 అంగుళాల లోతులో రంధ్రం ఏర్పడినట్లు ఎస్పీ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.