Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఇక పండుగే.. అన్ని సర్వీసులకు ఒకే యాప్.. వివరాలివిగో

1 July 2025

బీవీ పట్టాభిరామ్ కన్నుమూత,BV Pattabhiram: వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్.. ఇక లేరు.. – bv pattabhiram passed away due to heart attack in hyderadad

1 July 2025

Anti Aging Secrets: వయస్సు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండి చాలు..!

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Liquor Rates,AP Liquor policy: అక్టోబర్ ఒకటి నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ.. మద్యం షాపుల్లో వారికి రిజర్వేషన్లు – ap government allocates 10 percent quota for kallu geetha karmikulu in liquor shops
ఆంధ్రప్రదేశ్

Ap Liquor Rates,AP Liquor policy: అక్టోబర్ ఒకటి నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ.. మద్యం షాపుల్లో వారికి రిజర్వేషన్లు – ap government allocates 10 percent quota for kallu geetha karmikulu in liquor shops

.By .17 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Liquor Rates,AP Liquor policy: అక్టోబర్ ఒకటి నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ.. మద్యం షాపుల్లో వారికి రిజర్వేషన్లు – ap government allocates 10 percent quota for kallu geetha karmikulu in liquor shops
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏపీలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని మద్యం పాలసీ రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. నూతన మద్యం విధానంపై చర్చించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర కీలక వివరాలు వెల్లడించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నూతన మద్యం విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ రూపకల్పన కోసం ఆరు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం విధానాలను, అమ్మకాలను పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. కొత్త మద్యం పాలసీని రేపు జరిగే ఏపీ కేబినెట్ భేటీలో ఉంచనున్నట్లు కొల్లు రవీంద్ర తెలిపారు.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తరహాలోనే ఏపీలోనూ మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మద్యం షాపులను ప్రభుత్వం నడపకుండా.. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ఆలోచిస్తున్న ఏపీ ప్రభుత్వం.. మద్యం షాపుల్లో పది శాతం దుకాణాలను గీత కార్మికులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర.. అన్ని వివరాలను రేపు మంత్రివర్గ సమావేశంలో ఉంచుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారన్న మంత్రి.. తాము మాత్రం తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం ఇస్తామని అన్నారు.

మరోవైపు ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను పెట్టిందన్న మంత్రి కొల్లు రవీంద్ర.. దీంతో ఎక్సైజ్ శాఖ నిర్వీర్యమైందన్నారు. తమ ప్రభుత్వం ఇటీవలే ఎస్ఈబీను రద్దుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎక్సైజ్, ఎన్‌‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలను బలోపేతం చేస్తామన్న మంత్రి.. మద్యం నియంత్రణకు కూడా నిధులు కేటాయిస్తామన్నారు. మరోవైపు ఏపీలో నూతన మద్యం విధానం రూపకల్పన కోసం ఎక్సైజ్ శాఖ అధికారులు ఆరు రాష్ట్రాల్లో పర్యటించారు. తెలంగాణ, యూపీ, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో పర్యటించిన అధికారులు ఓ నివేదిక తయారుచేసి మంత్రివర్గ ఉపసంఘానికి అందజేశారు. చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలో ఈ నివేదికపైనా కేబినెట్ సబ్ కమిటీ చర్చించినట్లు తెలిసింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

బీవీ పట్టాభిరామ్ కన్నుమూత,BV Pattabhiram: వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్.. ఇక లేరు.. – bv pattabhiram passed away due to heart attack in hyderadad

1 July 2025

సత్యసాయి గ్రామంలో మ్యూజిక్‌ మాస్ట్రో AR రెహమాన్ సందడి.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రాపై ప్రశంసల జల్లు!

1 July 2025

Nara Lokesh: పసివాడి ప్రాణం కాపాడిన నారా లోకేష్..

1 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఇక పండుగే.. అన్ని సర్వీసులకు ఒకే యాప్.. వివరాలివిగో

1 July 2025

ఇకపై రైల్వే టికెట్ బుకింగ్ కోసం ఒక యాప్, రైలులో భోజనం కోసం మరో యాప్, రైలు రన్నింగ్ స్టేటస్…

బీవీ పట్టాభిరామ్ కన్నుమూత,BV Pattabhiram: వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్.. ఇక లేరు.. – bv pattabhiram passed away due to heart attack in hyderadad

1 July 2025

Anti Aging Secrets: వయస్సు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండి చాలు..!

1 July 2025

Monsoon Hair Care: వర్షాకాలంలోనూ మీ జుట్టు మెరిసిపోవాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!

1 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఇక పండుగే.. అన్ని సర్వీసులకు ఒకే యాప్.. వివరాలివిగో

1 July 2025

బీవీ పట్టాభిరామ్ కన్నుమూత,BV Pattabhiram: వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్.. ఇక లేరు.. – bv pattabhiram passed away due to heart attack in hyderadad

1 July 2025

Anti Aging Secrets: వయస్సు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండి చాలు..!

1 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.