అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి.. దీనిపై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. సమాధానమే దొరకట్లేదు. ఓ సారి అట్లీ అంటారు.. ఇంకోసారి త్రివిక్రమ్ అంటారు.. మరోసారి పుష్ప 3 అంటారు.
ఇందులో ఏది నిజమో అనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో పెరిగిపోయింది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. మరి ఆ క్లారిటీ ఏంటి..?
పుష్ప 2 అయ్యే వరకు అల్లు అర్జున్ ఫోకస్ మరో సినిమా వైపు వెళ్లేలా కనిపించట్లేదు. ఇండియాలో నెక్ట్స్ 1000 కోట్ల సినిమా ఇదే అంటూ పుష్ప 2పై అంచనాలు పెంచేస్తున్నారంతా.
సౌత్ కంటే నార్త్‌లోనే దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 వచ్చాకే.. నెక్ట్స్ ఏం చేద్దాం అనేది డిసైడ్ చేసుకోనున్నారు బన్నీ. డిసెంబర్ 6న పుష్ప 2 విడుదల కానుంది.
దీని తర్వాత ఆయన కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. అందులో త్రివిక్రమ్ అందరికంటే ముందున్నారు.. ఆ తర్వాత అట్లీ, సందీప్ రెడ్డి వంగా ఉన్నారు.
పుష్ప 3 అంటూ సుకుమార్ కూడా ఆసక్తి పెంచేస్తున్నారు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమా త్రివిక్రమ్‌తోనే అని తెలుస్తుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియన్ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దీని తర్వాత అట్లీ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్, టి సిరీస్ ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. మరోవైపు పుష్ప 3 ఉండే అవకాశం కూడా కొట్టి పారేయలేం. ఏదేమైనా ఒక్కటైతే కన్ఫర్మ్.. పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమా మాత్రం త్రివిక్రమ్‌తోనే.