ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలోని గొల్లమాడ గ్రామానికి చెందిన రుషితకు బైంసా మండలంలోని వానల్పాడ్ గ్రామానికి చెందిన వాటోలి రాజుతో గత మే నెలలో వివాహం జరిగింది. దసరా పండుగ సందర్భంగా తొలి బతుకమ్మ అత్తారింట్లోనే జరుపుకోవాలని భావించింది రిషిత. అందులో భాగంగానే శనివారం సాయంత్రం వానల్ పాడ్ గ్రామంలో అత్తారింటి వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొంది. దాదాపు గంటపాటు బతుకమ్మ పండుగలో సంబురంగా ఆడిపాడిన రుషిత తలనొప్పి వస్తుందంటూ ఇంటికి వెళ్లేందుకు సిద్దమైంది. అంతలోనే గుండెల్లో బరువుగా ఉందంటూ కుటుంబ సభ్యులకు చెప్పి ఒక్కసారిగా కుప్పకూలింది. అప్రమత్తమైన స్థానికులు , కుటుంబ సభ్యులు రుషిత ను స్థానికంగా ఉన్న ఆర్ఎంపి వద్దకు ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురైన రుషిత పరిస్థితి విషమంగా ఉందని బైంసాకు తరలించాలని సూచించాడు స్థానిక ఆర్ఎంపి. వెంటనే బైంసాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో అటు పుట్టిల్లు, ఇటు మెట్టినిల్లు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దడ పుట్టిస్తున్న బంగారం ధర.. మండిపోతున్న వెండి..
రోజుకో ఉసిరికాయ తింటే ఏమవుతుందో తెలిస్తే..
సమయం వృథా చేస్తున్నారా ??ఈ టిప్స్ పాటిస్తే సక్సెస్ మీదే
వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇది మీ కోసమే
బలమైన రోగ నిరోధక శక్తి కోసం 3 సూపర్ ఫ్రూట్స్