హైదరాబాద్‌లో బడా హోటళ్లు, రెస్టారెంట్లు లైటింగ్స్ తో కనువిందు చేస్తాయి. ఇక లోపలికి వెళితే మహా విందును రుచి చూపిస్తాయి. కానీ.. ఇక్కడే మరో అసలు నిజం ఉంది.. డబ్బులను తప్ప కస్టమర్లను, వారి ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు.. ఆహారంలో బొద్దింకలు, ఈగలు రావొచ్చు.. బల్లులు కనిపించవచ్చు.. శుచిశుభ్రత అసలు ఆ మాటే ఉండదు.. ఇటీవల హైదరాబాద్ నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలతో అసలు బయట తినాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.. సిటీలో నిత్యం ఎక్కడో చోట ఏదో ఒక హోటల్, రెస్టారెంట్లలోని తినే బిర్యానీలు, ఆహారంలో బొద్దింక, ఈగలు, పలు రకాల వైర్లు.. లాంటివి కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఓ ఫేమస్ రెస్టారెంట్ లో ఆరోగ్యానికి మంచిదని రాగి ముద్ద తింటుంటే.. బొద్దింక కనిపించింది.. ఇంకేముంది దెబ్బకు కస్టమర్ మతిపోయింది.. ఇదేంటని ప్రశ్నిస్తే.. యాజామన్యం ఏమో సరిగా స్పందించకుంగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది..
ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడ కృతింగ హోటల్ లో చోటుచేసుకుంది. రాగి సంకటిలో బొద్దింక కనిపించడంతో కస్టమర్ ఖంగుతిన్నాడు. రాగి సంకటి ముద్ద ఆర్డర్ ఇచ్చి.. తింటున్నాడు.. సగం తిన్నాక బొద్దింకను గమనించిన కస్టమర్ ఒక్కసారిగా షాకయ్యాడు. దీనిపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు.. అయితే.. వారు మాత్రం ఏం స్పందించకుండా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో కస్టమర్ ఈ ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు..
వీడియో చూడండి..
కాగా.. హైదరాబాద్ నగరంలోని దాదాపు అన్ని హోటళ్లలోనూ ఏ మాత్రం సుచీశుభ్రత పాటించడం లేదని.. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..