అంత భారీ పాము రోడ్డుపై కనిపించడంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు భయాందోళనకు గురవుతుండగా, ట్రాఫిక్ నియంత్రణలో ఉన్న మలక్‌పేట్ ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ పామును పట్టుకుని బంధించారు. ప్రజల్లో భయభ్రాంతులు కలగకుండా.. ఎలాంటి తొందరపాటు లేకుండా పామును సురక్షితంగా పట్టుకుని అక్కడే ఉన్న అటవీశాఖ అధికారులకు అప్పగించారు. పాముకు ఎలాంటి గాయం లేకుండా హుందాగా పరిస్థితిని చక్కబెట్టిన వెంకటేష్ నాయక్ సాహసానికి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొండచిలువలు సాధారణంగా అడవుల్లో కనిపిస్తుంటాయి. ఇవి విషం లేని పాములు అయినా వాటి పరిమాణం, ఆకృతి వల్ల ప్రజలు భయపడుతుంటారు. నగర ప్రాంతాల్లో ఇలాంటి పాములు కనిపించడం అరుదుగా జరుగుతుంటుంది. అటవీశాఖ అధికారులు కొండచిలువను స్వాధీనం చేసుకుని తిరిగి దూరప్రాంతాల్లో వదిలేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా అధికారులను పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajinikanth: డివోషనల్ ట్రిప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్.. కారణం అదేనా ?
TOP 9 ET News: OG ప్రీక్వెల్‌లో అకీరా.. క్లారిటీ ఇచ్చిన సుజీత్
Keerthy Suresh: కీర్తి సురేష్ తీరు ఈ మధ్య ఎవరికీ అర్థం కావడం లేదు.. అస్సలు ఏమైంది ఈ ముద్దుగుమ్మకు
నెలకు రూ.30లక్షల జీతాన్ని వదిలి.. హీరోగా మారిన కుర్రాడు
Kantara: Chapter 1: 1000 కోట్లా.. అంత సీన్ ఉందంటారా ??