జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు అధిష్టానం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తన పేరును ప్రకటించడంతో పార్టీ అధిస్తానంకు ధన్యవాదాలు తెలిపారు నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలుపు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసమే ఎన్నికల బరిలో బలమైన అభ్యర్ధిని దించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే సుదీర్ఘ చర్చల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
Congress announces Naveen Yadav as the party’s candidate for the ensuing bye-election to the Legislative Assembly of Telangana from Jubilee Hills Constituency. pic.twitter.com/EaWhBIFs7x
— ANI (@ANI) October 8, 2025