యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ- నెట్ డిసెంబర్ 2025) పరీక్షకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పరీక్షను మొత్తం 85 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యేటా రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ సెషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభమైంది. అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోం సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా, తదితర సబ్జెక్టుల్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ (యూజీసీ నెట్) 2025 పరీక్షను నిర్వహిస్తుంది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, పీహెచ్‌డీ ప్రవేశాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఈ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది.
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 55 శాతం మార్కులతో పీజీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్, ఎన్‌సీఎల్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో పాసైతే సరిపోతుంది. జేఆర్‌ఎఫ్‌కు డిసెంబర్ 1.12.2025 నాటికి అభ్యర్ధులకు 30 ఏళ్లు దాటకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. సంబంధిత సబ్జెక్టులో అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 7, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1150, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్‌సీఎల్ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్ధులు రూ.325 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
రాత పరీక్ష విధానం
యూజీసీ నెట్ 2025 పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. రెండు పేపర్లలోని మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ఇక పేపర్ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష 3 గంటల వ్యవధిలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయిస్తారు.
ఇవి కూడా చదవండి
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 7, 2025.
- పరీక్ష రుసుం చెల్లింపులకు చివరి తేదీ: నవంబర్ 7, 2025.
- దరఖాస్తు సవరణ తేదీలు: నవంబర్ 10 నుంచి 12 వరకు.
- పరీక్ష తేదీ: త్వరలో వెల్లడిస్తారు
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.