విద్యార్థులు, తల్లిదండ్రులకు అలెర్ట్.. ఈ నెల 14 అంటే మంగళవారం రోజున స్కూల్స్, కాలేజీలు బంద్ అవ్వనున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో.. తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ తెలంగాణ బంద్‌కు.. ఉద్యమ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. అన్ని కుల సంఘాలతో పాటు.. రాజకీయ పార్టీలు ఈ బంద్‌కు మద్దతివ్వాలని కోరారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో ఈ నెల 14న బంద్ నిర్వహిస్తామన్నారు. రాస్తారోకోలతో దేశమంతా చర్చించుకునేలా బంద్ ఉంటుందని, బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆర్ కృష్ణయ్య ప్రకటించారు.
తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తమకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 14వ తేదీన బీసీ సంఘాలు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలు దాదాపు బంద్ అయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థులకు మరో సెలవు లభించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.