Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Women’s World Cup : మహిళల ప్రపంచ కప్‌లో బురఖా వేసుకుని ఆడుతున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు?.. వైరల్ అవుతున్న ఫోటో నిజమా? ఫేకా ?

14 October 2025

Vizag Google: విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్.. అందరి చూపు వైజాగ్ వైపే

14 October 2025

Watch: చుక్క పడ్డాకే అసలు సీన్ మొదలైంది.. కాళికా బార్‌లో సినిమా ఫైటింగ్ రియల్ సీన్.. వీడియో

14 October 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Cm Chandrababu Inaugurated Crda Headquarters,​ఘనంగా సీఆర్డీఏ భవనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఇక అమరావతికి తిరుగుండదు.. – ap cm chandrababu naidu inaugurated crda headquarters in amaravati
ఆంధ్రప్రదేశ్

Cm Chandrababu Inaugurated Crda Headquarters,​ఘనంగా సీఆర్డీఏ భవనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఇక అమరావతికి తిరుగుండదు.. – ap cm chandrababu naidu inaugurated crda headquarters in amaravati

.By .13 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Cm Chandrababu Inaugurated Crda Headquarters,​ఘనంగా సీఆర్డీఏ భవనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఇక అమరావతికి తిరుగుండదు.. – ap cm chandrababu naidu inaugurated crda headquarters in amaravati
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజధానికి భూములిచ్చిన రైతులతో కాసేపు ముచ్చటించారు. అత్యాధునిక హంగులతో ఏడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో.. వివిధ విభాగాల కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. దీంతో పరిపాలన సౌలభ్యం మెరుగుపడనుంది. ఈ భవనంలో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, మీటింగ్ హాల్స్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు, ఉన్నతాధికారుల ఛాంబర్లు కూడా ఉన్నాయి.

హైలైట్:

  • అమరావతిలో సీఆర్డీఏ భవనం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • అత్యాధునిక హంగులతో ఏడు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న భవనం
  • ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులతో ముచ్చటించిన సీఎం
AP cm chandrababu naidu inaugurated crda headquarters
సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభించిన సీఎం చంద్రబాబు..(ఫోటోలు– Samayam Telugu)
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిలో.. సీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఘనంగా ప్రారంభించారు. పూర్ణకుంభం, వేదాశీర్వచనాలతో సీఎంకు వేదపండితులు స్వాగతం పలికారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ప్రారంభించారు సీఎం. అనంతరం ముఖ్యమంత్రి.. భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయనతో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ.. భవన నిర్మాణ శైలి, ఇక్కడి సౌకర్యాలను సీఎంకు వివరించారు. భవనం ప్రారంభానికి ముందు చంద్రబాబు రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. రాజధాని నిర్మాణం కోసం.. రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

భవనం ప్రత్యేకతలివే..

సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని 4.32 ఎకరాల్లో 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అత్యాధునిక హంగులతో ఏడు అంతస్తుల్లో (జీ+7) నిర్మితమైంది ఈ సీఆర్డీఏ భవనం. ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి, మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. సీఆర్డీఏ సహా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలకు అనుబంధంగా ఉన్న కార్యాలయాలన్నీ ఈ నూతన భవనంలోకి మారనున్నాయి. రాయపూడి సమీపంలోని సీడ్ ఆక్సిస్ రహదారి వద్ద నిర్మించిన ఈ కార్యాలయ భవనం ముందు.. అమరావతిని ప్రతిబింబించేలా A అక్షరంతో ఎలివేషన్‌ ఇచ్చారు. ఇందులో రిసెప్షన్, పబ్లిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, బ్యాంకు, AI కమాండ్ సెంటర్, మీటింగ్ హాల్స్ , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, CRDA, ADCL విభాగాలు, ఉన్నతాధికారుల ఛాంబర్లు కూడా ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ భవనం మొదటి అంతస్తులో మీటింగ్ హాల్స్.. 2, 3, 5 అంతస్తుల్లో సీఆర్డీఏ, నాలుగో ప్లోర్‌లో సీడీఎంఏ పురపాలక డైరెక్టరేట్ కార్యాలయం ఉటుంది. ఆరో అంతస్తులో అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేశారు. ఇక భవనం పైకప్పుపై ప్రీ-ఇంజినీర్డ్ డైనింగ్ ఏరియాను కూడా ఏర్పాటు చేశారు.

మరోవైపు ప్రధాన కార్యాలయానికి పక్కనే మొత్తం 8 ఎకరాల్లో.. మరో 4 భవనాలు నిర్మించారు. ఒక్కో భవనం 41,500 చదరపు అడగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంది. కాగా ఇంతకుముందు వరకు సీఆర్డీఏ కార్యాలయం విజయవాడ కేంద్రంగా పరిపాలన సాగించింది. ఇప్పుడు సీఆర్డీఏ భవనం పూర్తి కావడంతో.. వివిధ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండనున్నాయి. ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించే వీలు ఉంటుంది. ఇక రాజధాని అభివృద్ధి పనుల పునరుద్ధరణ కూడా వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.

భూపతి రాజు

రచయిత గురించిభూపతి రాజుభూపతి రాజు సమయం తెలుగులో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ట్రెండింగ్ సహా వివిధ అంశాలపై ప్రత్యేక కథనాలు రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయం, అంతర్జాతీయం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన తాజా వార్తలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్‌తోపాటు ప్రత్యేక కథనాలు, విశ్లేషణలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ETV భారత్ సంస్థలో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్, స్పోర్ట్స్, సినిమా న్యూస్ రాశారు. లోక్‌సభ ఎన్నికల కోసం జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. భూపతి రాజు ఈనాడు జర్నలిజం స్కూల్‌ (EJS) నుంచి జర్నలిజంలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.… ఇంకా చదవండి