వివాహ వేడుక అంటే కేవలం ఒక వేడుక కాదు.. అది చాలా అలసిపోయే ఆచారాల వ్యవహారాలు కూడా ఉంటాయి. పసుపు (నలుగు) పెట్టడం నుంచి సంగీత్ వరకు రకరకాల ఆచారాలు వధూవరులను చాలా అలసిపోయేలా చేస్తాయి. వాటి ప్రభావం పెళ్లి రోజున వివాహ మండపంలో కనిపిస్తుంది. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వివాహ ఆచారాల సమయంలో ఒక వధువు మండపంలో నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో వరుడు చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.
ఈ వైరల్ వీడియోలో దండలు మార్చుకున్న తర్వాత పెళ్లి మండపంలో వధూవరులు కూర్చుని ఉండటం మీరు చూడవచ్చు. పూజారి వివాహ ఆచారాలను నిర్వహిస్తున్నాడు. ఇంతలో కెమెరా మెన్ వధువుపై దృష్టి పెట్టాడు. అప్పుడు ఆమె అలసిపోయి మండపంలో నిద్రపోయింది.
ఇవి కూడా చదవండి
అయితే ఈ సమయంలో వరుడి హావభావం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వీడియోలో వరుడు ప్రేమగా వధువును మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వధువు మేల్కొన్న వెంటనే ఒక్క క్షణం ఆశ్చర్యపోతుంది. మొత్తంమీద ఈ చిన్న వీడియో క్లిప్ వివాహం అందమైన బంధాన్ని .. జంట ఒకరి పట్ల ఒకరు చూపించే శ్రద్ధను సంపూర్ణంగా తెలియజేస్తుడి.
Instagramలో @success_life_partner అనే ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోను 4,21,000 కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. తమ సంతోషాన్ని తెలియజేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చస్తున్నారు.
ఒక యూజర్ సరదాగా ఇలా వ్యాఖ్యానించాడు, “ముందు నన్ను కొంచెం నిద్రపోనివ్వండి, పెళ్లి ఇంకా జరుగుతుంది అని అంటే.. మరొకరు, “వరుడి చిరునవ్వు నా హృదయాన్ని గెలుచుకుంది.” మరొక యూజర్ పెళ్లి లో కూడా ఆ అమ్మాయిని నిద్రపోనివ్వలేదు. అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తూ తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని వైరల్ వీడియోను ఇక్కడ చూడండి