బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. ఆదివారం జరిగిన స్పెషల్ ఎపిసోడ్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, దువ్వాడ (దివ్వల)మాధురి, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, సీరియల్ నటి ఆయేషా జీనథ్. సీరియల్ నటుడు గౌరవ్ గుప్తా ఎంట్రీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక కొత్త కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ హౌస్ నిజంగానే రణరంగంగా మారింది. సోమవారం (అక్టోబర్ 13) రిలీజ్ చేసిన రెండు ప్రోమోల్లోనూ ఇది కనిపించింది. హౌస్ లోని కంటెస్టెంట్స్ కల్యాణ్, దివ్యా నికితా, మాధురి మధ్య మాటల తూటాలు పేలాయి. దీంతో మాధురి కన్నీళ్లు కూడా పెట్టుకుంది. మరోవైపు మాధురికి సపోర్ట్ గా బయటి నుంచి తన వంతు ప్రమోషన్స్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్. వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా మాధురితో రిలేషన్ షిప్, బిగ్ బాస్ ఆఫర్ తదితర విషయాలపై ఓపెన్ గా మాట్లాడారు.
‘నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఎలా కండక్ట్ చేస్తారో నాకు అసలు తెలియదు. కొంత మంది వైల్డ్ కార్డ్ మీద వస్తారు. ఎలిమినేట్ అయ్యిన వాళ్లు, గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న వాళ్లు కూడా హౌస్ లోకి వస్తుంటారు. బిగ్ బాస్ టీమ్ కు చాలా సమీకరణాలు ఉంటాయి. మొదట మా ఇద్దర్ని కలిసి రమ్మని బిగ్ బాస్ నిర్వాహకులు అడిగారు. కానీ బయట నాకు చాలా బిజినెస్ లు ఉన్నాయి.. కాబట్టి కుదరలేదు. అందుకే నేను వద్దు అనుకోని మాధురిని పంపించాలి అని డిసైడ్ అయ్యాను. నేను ఇప్పటికే జీవితంలో అన్ని చూసేశాను. ప్రత్యేకంగా నేను హౌస్ కు వెళ్లక్కర్లేదు. కానీ మాధురికి ఈ అనుభవం రావాలి. ఒక మహిళగా ఆమె మరింత ముందుకు వెళ్లాలి. అందుకనే ఆమెను పంపించాను. బిగ్ బాస్ టీమ్ ఇంకోసారి పిలిస్తే అప్పుడు చూస్తాను’ అని చెప్పుకొచ్చారు దువ్వాడ. అంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో నైనా దువ్వాడ బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారేమో.
ఇవి కూడా చదవండి
దువ్వాడ శ్రీనివాస్ షేర్ చేసిన వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.