లవర్ బాయ్ తరుణ్, రిచా జంటగా నటించిన ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ ‘నువ్వే కావాలి’. కె.విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ ప్రేమ కథా చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఇలా ఆడియెన్స్ ను అలరించే అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. అందుకే ఆడియెన్స్ ఈ మూవీ కోసం థియేటర్లకు పరుగులు తీశారు. ముఖ్యంగా యూత్ అయితే నువ్వే కావాలి సినిమా టికెటట్ల కోసం ఎగబడ్డారు. అప్పట్లో కేవలం రూ.1.3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ రూ.24 కోట్ల కు పైగా వసూలు చేసింది. 20 సెంటర్స్‌కు పైగా 200 రోజులు రన్ కాగా… 6 సెంటర్లలో ఏడాది పాటు ప్రదర్శితమైంది. ఇక హైదరాబాద్ లోని ఓ థియేటర్లలో కంటిన్యూగా 250 రోజులు ఆడింది. నువ్వే కావాలి సినిమా రిలీజై సోమవారం (అక్టోబర్ 13) నాటికి సరిగ్గా 25 ఏళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తున్నారు.
అయితే నువ్వే కావాలి సినిమాకు హీరోగా తరుణ్ ఫస్ట్ చాయిస్ కాదట. ముందుగా మహేష్ బాబును హీరోగా అనుకున్నారట. అయితే అప్పటికే మహేష్ చేతిలో చాలా సినిమాలు ఉండడంతో ఈ కథపై పెద్దగా ఆసక్తి చూపించలేదట. దీంతో అక్కినేని సుమంత్ ను అప్రోచ్ అయ్యారట. అతను కూడా మరో మూవీతో బిజీగా ఉండడంతో ఇక మరో హీరో కోసం ప్రయత్నాలు ప్రారంభించారట. అలా అప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా 20 – 30 సినిమాల్లో నటించిన తరుణ్ ను హీరోగా సెలెక్ట్ చేశారట. ఇక ఇంటర్ చదివే టైంలో ఓ యాడ్‌లో నటించిన రిచాను చూసి హీరోయిన్‌గా ఎంపిక చేశారట.
నువ్వే కావాలి సినిమాతోనే తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో రెండో హీరోగా సాయి కిరణ్ నటించాడు. ఇక కోటి పాటలు, త్రివిక్రమ్ మాటలు నువ్వే కావాలి సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మరి ఈ సినిమా మహేష్ బాబు చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉందేదో..
Can you believe it’s been 25 years since Nuvve Kavali first stole our hearts? 😇😇
25 years, countless memories, Nuvve Kavali lives on in every heartbeat. 💞 #NuvveKavali #TimelessLove #25Years pic.twitter.com/9Lk4yp6DNq— ETV Win (@etvwin) October 13, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.